ఓం నమః శివాయ:
*శ్రీఆదిశంకర భగవత్పాదాచార్య కృతం అర్ధనారీశ్వర స్తోత్రం / 🧘♀️అర్థనారీశ్వర తత్వం - విశ్లేషణ🧘♂️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
*1)చామ్పేయగౌరార్ధశరీరకాయై కర్పూరగౌరార్ధ శరీరకాయ ।*
*ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ ॥*
*సంపెంగపువ్వువలే ఎర్రనైన అర్ధశరీరము కలదీ – కొప్పు ధరించినది అగు పార్వతికి, కర్పూరము వలే తెల్లనైన అర్ధశరీరము కలవాడు – జటాజూటము ధరించిన వాడు అగు శివునకు నమస్కారము.*
*2)కస్తూరికాకుఙ్కు మచర్చితాయై చితా రజఃపుఞ్జ విచర్చితాయ ।*
*కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ ॥*
*కస్తూరీ – కుంకుమలను శరీరముపై పూసుకున్నది – మన్మథుని బ్రతికించునది అగు పార్వతికి, చితిలో భస్మను పూసుకున్నవాడు – మన్మథుని సంహరించినవాడు అగు శివునకు నమస్కారము.*
*3)ఝణత్క్వణత్కఙ్కణ నూపురాయై పాదాబ్జ రాజత్ఫణి నూపురాయ ।*
*హేమాఙ్గదాయై భుజగాఙ్గదాయ నమః శివాయై చ నమః శివాయ ॥*
*ఝణ ఝణమని మ్రోగు కంకణములు – అందెలు, బంగారు భుజకీర్తులు ధరించిన పార్వతికి, పాములను పాదములందు కడియములుగానూ – చేతులందు కేయూరములుగానూ ధరించిన శివునకు నమస్కారము.*
*4)విశాల నీలోత్పల లోచనాయై వికాసి పఙ్కేరుహ లోచనాయ ।*
*సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ ॥*
*విశాలమైన నల్లకలువలవంటి కన్నులు కలది – రెండు కన్నులున్నదగు పార్వతికి, వికసించిన ఎర్రతామరల వంటి కన్నులు కలవాడు – మూడు కన్నులు కలవాడు అగు శివునకు నమస్కారము.*
*5)మన్దారమాలాకలితాలకాయై కపాల మాలాఙ్కిత కన్ధరాయ ।*
*దివ్యామ్బరాయై చ దిగమ్బరాయ నమః శివాయై చ నమః శివాయ ॥*
*మందారమాలను కురులలో అలంకరించుకున్నది – దివ్య వస్త్రములను ధరించినది అగు పార్వతికి, మెడలో కపాలమాలను అలంకరించుకున్నవాడు – దిగంబరుడగు శివునకు నమస్కారము.*
*6)అమ్భోధర శ్యామల కున్తలాయై తడిత్ప్రభాతామ్ర జటాధరాయ ।*
*నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ ॥*
*మబ్బువంటి నల్లని కేశములు కలది – తనకంటే గొప్పవారు లేనిది అగు పార్వతికి, మెరుస్తున్న రాగిరంగు జటాజూటము కలవాడు – అందరికంటే గొప్పవాడు అగు శివునకు నమస్కారము.*
*7)ప్రపఞ్చసృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాణ్డవాయ ।*
*జగజ్జనన్యై జగదేకపిత్రే నమః శివాయై చ నమః శివాయ ॥*
*ప్రపంచమును సృష్టించుటకు ఉన్ముఖమైన లలిత నృత్యము చేయు జగన్మాతయగు పార్వతికి, సమస్తమును సంహరించు ప్రచండ తాండవము చేయు జగత్పితయగు శివునకు నమస్కారము.*
*8)ప్రదీప్తరత్నోజ్జ్వల కుణ్డలాయై స్ఫురన్మహా పన్నగ భూషణాయ ।*
*శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ ॥*
*ప్రకాశించు రత్నకుండలములు ధరించినది – శివునితో కలసినది అగు పార్వతికి, శోభిల్లు మహాసర్పములను అలంకరించుకున్నవాడు – పార్వతితో కలసినవాడు అగు శివునకు నమస్కారము.*
*9)ఏతత్పఠేదష్టకమిష్టదం యో భక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవీ ।*
*ప్రాప్నోతి సౌభాగ్య మనన్తకాలం భూయాత్సదా తస్య సమస్తసిద్ధిః ॥*
*కోరికలు తీర్చు ఈఎనిమిదిశ్లోకముల స్తోత్రమును భక్తితో పఠించువాడు, ఆదరణీయుడై భూలోకమునందు చిరకాలము జీవించును. అనంతకాలము సౌభాగ్యమును పొందును. అతనికి ఎల్లప్పుడూ అన్నీ సిద్ధించును.*
🕉🌞🌎🌙🌟🚩
*🧘♀️అర్థనారీశ్వర తత్వం - విశ్లేషణ🧘♂️*
🕉🌞🌏🌙🌟🚩
*మన భారతీయ శాస్త్రాలలో స్వర శాస్త్రం అనే శాస్త్రం ఉంది. చాలా మందికి స్వరశాస్త్రం అంటే సంగీత శాస్త్రం అనే అపోహ కూడా ఉంది. స్వర శాస్త్రం అంటే మనం పీల్చే గాలి మన శరీరంలో ఏఏ నాడుల మీద ఎలా పని చేస్తుందో తెలిపే శాస్త్రం. ఈ శాస్త్రం అంతా సాంకేతిక పదాలతో నిగూఢంగా ఉంటుంది. స్వర సాధన అనుభవాల పుట్ట. తంత్ర సాధనలో స్వరసాధన చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. తంత్ర సాధకులు నిగూఢమైన పేర్లతో అవయవాలను పోల్చారు. మనం పీల్చేగాలిని బట్టి పేర్లు పెట్టారు.*
*కుడి వైపు నాడి యందు శ్వాస ప్రవహిస్తుంటే శివ, సూర్య, పగలు, యమున, పింగళ అని, ఎడమవైపు నాడి యందు శ్వాస ప్రవహిస్తుంటే శక్తి, చంద్ర, రాత్రి, గంగ అనే పేర్లు పెట్టారు. వీటిలో గాక ముక్కు రెండు రంద్రాలనుండి సమానంగా శ్వాస నడుస్తుంటే అగ్ని, సంధ్య, సరస్వతి, సుషుమ్న అని పెర్లు పెట్టారు. ఇది అతి ప్రాచీన రహస్య విజ్ఞానం. గురువు ద్వారా శిష్యులు నేర్చుకునే విజ్ఞానం. ఈ సాధనద్వారా సాధకులు అనేక అతీత శక్తులను పొందుతారని శాస్త్ర వచనం మరియూ ఆప్త వాక్యం.*
*ఈ శాస్త్రాన్ని అభ్యసించిన వారు మన తెలుగు నేలలో ముఖ్యంగా వేమన, పోతులూరి వీరబ్రహ్మం, ఇంకా అనేక మంది పేరు సిద్ధులు. ఇంకా చాలామంది ఈ స్వరశాస్త్రాన్ని అభ్యసించిన మహానుభావులు తెలుగునాట ఉన్నారు. అనేక గ్రంథాలు తెలుగులో ఈ శాస్త్రం మీద వెలువడ్డాయి. కానీ కొన్నీ అవి నేడు అలభ్యాలు.*
*ఈ శాస్త్రానికి మూల పురుషుడు అర్థనారీశ్వరుడు. నేటి సైన్సు పరిభాషలో చెప్పాలంటే మెదడులో కుడి ఎడమ మెదడులు (Hemispheres) ఉన్నాయి.*
*మస్తిష్కం మెదడులోని అన్నిభాగాలకన్నా పెద్దది. పుర్రెలో పైభాగమంతటినీ ఆక్రమించి ఉంటుంది. దీన్ని దైర్ఘ్య విదరము
(Superior Longitudinal fissure) అనే రెండు అర్థచంద్రాకార భాగాలుగా విభాజితమై ఉంటుంది. ఈ భాగాలను మెదడు గోళార్థాలు (Cerebral hemispheres) అంటారు. యోగులు ఈ భాగాలను సూర్య చంద్రులని అంటారు.*
*న్యూరాలజిస్టులు ఆడ, మగ చర్యలకు ఎడమ, కుడి మెదడు కు గల సమ సంబంధాన్ని తెలుసుకున్నారు. ఆడవారు ఎక్కువ ఎడమ గోళార్థం పై ప్రభావం కలిగి ఉంటారు. మగవారు ఎక్కువ కుడివైపు గోళార్థం పై ప్రభావం కలిగి ఉంటారు.*
*మెదడులో గల హార్మోన్లు (స్త్రీ /పురుష) తమ తమ తేడాకు కారణంగా సైన్స్ నిర్థారణ చేస్తుంది. దేహ ధర్మాలలో ఏ తేడా ఉన్నప్పటికీ, ఇడా తత్వం స్త్రీ ప్రధానంగాను, పింగళా తత్వం పురుష ప్రధానంగాను ఉన్నవి. ఈ తత్వమే అర్థనారీశ్వర తత్వం. ఒక మనిషిలో ఉండే ధనాత్మక ఋణాత్మక తత్వాల కలయికే అర్థనారీశ్వర తత్వం. ఈ ప్రాతిపదికనే అర్థనారీశ్వర తత్వం ప్రతిపాదింప బడింది.*
*పరమేశ్వరుడు కుడివైపు పురుషతత్వానికి (పింగళ), ఎడమవైపు పార్వతి స్త్రీ త్త్వానికి (ఇడా)ప్రతిబింబాలు.*
🕉🌞🌏🌙🌟🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి