శ్రీ కామాక్ష్యంబాష్టకం
1) నక్షత్రగ్రహమండలాధిపత్యరవీంద్వగ్నితేజోమయరూపిణీం
ఏకామ్రేశ్వరహృదయకమలమధ్యస్థితముఖ్యప్రాణరూపిణీం
ప్రముఖమూకకవీశ్వరభావనామయజగద్రచనాసృష్టికారిణీం
కామాక్షీం పరశివాం భగవతీం కాంచీపురవాసినీం ||
2) సాంద్రానందకరుణాపూరితకలుషవిదూరకమలలోచనీం
పావనతులసీబిల్వమందారాదిపుష్పమాలాలంకృతాం
మాతంగముఖశరవణభవసేవితపల్లవచరణకమలాం
కామాక్షీం పరశివాం భగవతీం కాంచీపురవాసినీం ||
3) త్రిబీజాత్మకత్రయీరాధితత్రిగుణాతీతతత్త్వాత్మికాం
శ్యామశాస్త్రిసంతతకీర్తితకోమలపర్వతరాజనందినీం
శ్రీఆదిశంకరాచార్యార్చితశ్రీకామకోటిపీఠాధిష్టాత్రీం
కామాక్షీం పరశివాం భగవతీం కాంచీపురవాసినీం ||
4) సత్సంతానసౌభాగ్యప్రదాయకజగన్మాతృకారుపిణీం
ఉద్యోగవ్యాపారాభివృద్ధిదాయకశుభమంగళచండికాం
సకలశతృబాధానివారకసర్వరక్షాకరసింహవాహినీం
కామాక్షీం పరశివాం భగవతీం కాంచీపురవాసినీం ||
5) తపోనిష్ఠాగరిష్ఠధ్యానసమాధిస్థితశ్రీచంద్రశేఖరభారతీరూపిణీం
సంగీతనృత్యతాళవాద్యబృందపరివృతలాస్యానందరూపిణీం
నానావిధరత్నాభరణభూషితఅరుణవర్ణాంబరధారిణీం
కామాక్షీం పరశివాం భగవతీం కాంచీపురవాసినీం ||
6) రమావాణీసంతతసేవితమృదుమందస్మితవదనాంభోరుహాం
పవిత్రప్రదోషసమయసదాశివసహసుందరనాట్యకేళీవిలాసినీం
మోహాంధకారహరణమహాదుర్గతివారణకాలకాలకుటుంబినీం
కామాక్షీం పరశివాం భగవతీం కాంచీపురవాసినీం ||
7) శ్రీసదాశివలింగార్చితతపోమయజ్వలామాలినీం
పరమేష్ఠీమహేంద్రాదిసురసేవితసూక్ష్మశరీరిణీం
వేదవేదాంగరక్షణదీక్షాదక్షసత్సాంప్రదాయేశ్వరీం
కామాక్షీం పరశివాం భగవతీం కాంచీపురవాసినీం ||
8) చందనహరిద్రాకుంకుమద్రవదిగ్ధాంగకామేశ్వరమనఃప్రియాం
భక్తజనమోక్షానందప్రదాయకఅమృతకిరణస్వరూపిణీం
శమదమాదిషట్కసంపత్తిప్రదఆత్మానాత్మవివేకదాయినీం
కామాక్షీం పరశివాం భగవతీం కాంచీపురవాసినీం ||
సర్వం శ్రీకామాక్షీపరాంబాదివ్యచరణారవిందార్పణమస్తు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి