అన్నమాచార్య బోధ
( మంజరీ ద్విపద )
✍️ గోపాలుని మధుసూదన రావు
నిఖిల జీవుల లోన నేనెంతవాడ ?
కడిగి యా యీశుండె కాపాడు చుండె
చెప్పినా రెవ్వరా చిట్టి చీమలకు
పుట్టలో ధాన్యముల్ పెట్టుకొండనుచు
అంతరంగమ్ములో యాది నుండియును
సంసారభ్రాంతి నా సర్వేశ్వరుండె
కల్గించి బ్రతుకును గల్గించుచుండు
చెప్పిరెవ్వరు బుద్ధి చెట్టున కీలలొ
ఆదనులో మొలకెత్తి అభివృద్ధి నొంద
కొమ్మలన్ పూవులన్ గూర్చు కొమ్మనుచు
కూడి చైతన్య మై గుట్టుగా నుండి
ఆనుగుణ గుణములన్ అందించు ప్రభువు
పుట్టిన మెకముకు బుద్దెట్లు గలిగె
చనుబాలు వెంటనే చప్పరించుటకు
మృదువైన పచ్చికన్ మెసవుచుండుటకు
అంతరంగమ్ములో అనునిత్యముండి
ప్రాణుల కనువైన పనులను నేర్పు
శ్రీ వేంకటేశుడే చేయు సర్వంబు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి