*ఆచార్య సద్భోదన*
ఒక చిన్న పిల్లవాడికి తన తల్లి పట్ల ఉండేటటువంటి వ్యాకులత మనకు భగవంతుడి మీద ఉండాలి.
ఎవరికైతే ప్రాపంచిక సుఖాలు ఏ మాత్రం రుచించక, ధనం, పేరుప్రతిష్టలు, వగైరాలన్నీ తృణప్రాయంగా కనిపిస్తాయో, అటువంటి వారే నిజంగా భగవంతుని కోసం విలపిస్తారు. వారి కోసం భగవంతుడు పరుగు పరుగున వస్తాడు.
ఆ వ్యాకులతే ఆధ్యాత్మికతకు సర్వస్వం. ప్రతివారూ తన గడియారం సరైన కాలాన్ని చూపిస్తోందని అనుకుంటారు. కానీ ఏ గడియారం కూడా సంపూర్ణమైన ప్రమాణం కానేరదు. అలాకాక పోవడం వలన పెద్ద నష్టం ఏమీ లేదు కూడా.
భగవంతుడి కోసం తపన పడేవాడు సాధు పురుషుల సాంగత్యాన్ని అలవరచుకుని వారి సహాయంతో తనను తాను వీలైనంత సరిదిద్దుకోవాలి.
*శుభంభూయాత్*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి