20, అక్టోబర్ 2020, మంగళవారం

శుద్ధ చెతన్యం

శుద్ధ చెతన్యం 

మనం చూసే ప్రతి జీవి అది భూమిమీద వున్నా, గాలిలో తిరిగిన, నీటిలో వున్నా అన్నిటిలో మనం ఒక సాధారణ విషయాన్ని చూస్తున్నాము అదే జీవత్వం. జీవత్వం వున్నది కాబట్టే వాటిని జీవులు అని అంటున్నాము. ఈ జీవత్వం మనం చూసే జీవులకన్నా భిన్నంగా ఉండి జీవులను చెతన్యవంతులుగా చేస్తున్నది. అంటే జంతువులు కదలటం శ్వాసించటం, సంతానోత్పత్తి చేయటం లాంటి అనేక జీవన  వ్యాపారాలు చేస్తున్నాయి. నిజానికి మన కంటికి కనిపించే జీవులకు  మన కంటికి కనిపించని ఏదో ఒక శక్తి ఈ జీవులను చెతన్యవంతంగా చేస్తున్నది అని మనకు గోచరిస్తుంది. . ఆ శక్తి వల్లనే విత్తుగా వున్నది భూమిలోనాటంగానే  మొలకగా, మొక్కగా, చెట్టుగా, లతగా, వృక్షాముగా ఇలా వేరు వేరు రూపాంతరాలు పొంది మరల పూలు, కాయలు, విత్తులను ఇస్తున్నది. ఈ కార్యాలు అన్ని మన కంటికి గోచరిస్తూవున్నాయి.  మరి ఈ కార్యాలకు కారణమైన ఆ కారణభూతి ఎవరు.  ఆ కారణమే ఒక అద్భుతమైన శక్తి ఆ శక్తికి మీరు ఏ పేరైనా పెట్టండి కానీ ఆ శక్తి మాత్రం వున్నదని ప్రతి మనిషి ఒప్పుకొని తీరవలసిందే. ఎప్పుడైతే ఆ శక్తి జీవులని వీడుతుందో అప్పుడు జీవులు చెతన్య రహితంగా అవుతున్నాయి  ఆ స్థితినే మనం మరణం అని అంటున్నాము. 

ఇట్లా ప్రతి జీవిని చెతన్యవంతం చేసే ఆ శక్తే శుద్ధ చెతన్యం. ఆ చెతన్యం గూర్చిన విషయాలు తెలుసుకొనే దిశలోనే  మన పయనం. 

ఓం తత్సత్ 

**********************

కామెంట్‌లు లేవు: