20, అక్టోబర్ 2020, మంగళవారం

దసరానవరాత్రులు - వైష్ణవి

 దసరానవరాత్రులు - వైష్ణవి 


శృంగేరి సంస్థానానికి చెందిన దేవాలయాలలో అమ్మవారిని ఈ రోజు వైష్ణవిరూపంలో ఆరాధన చేస్తారు. ఈ తల్లి కూడా సప్తమాతృకలలో ఒక తల్లి. పరమశివుడు అంధకాసుర సంహారమునందు సహాయము కోసం ఈ సప్తమాతృకలను సృష్టించగా ఆయా దేవతామూర్తులు ఈ మాతృకలకు వారి శక్తిని ధారపోశారు. వైష్ణవి అనగా విష్ణుమూర్తి యొక్క శక్తి.


ఈ వైష్ణవి శబ్దానికి దేవీపురాణము నాలుగు అర్ధాలను తెలియచేసింది. అందు 1. వైష్ణవివలె శంఖచక్రములను ధరించినది కనుక ఈమె వైష్ణవి. 2. విష్ణువుకు మాత (తల్లి) కనుక వైష్ణవి. 3. విష్ణువు వలె శత్రువులగు రాక్షసులను సంహరించింది కనుక వైష్ణవి. 4. విష్ణుస్వరూపురాలు కనుక వైష్ణవి. ఎందు చూసినా విష్ణుశబ్దమే తెలియబడుచున్నది.


అసురులు అనగా ఈ కలియుగంలో ఎవరో కాదు. వారు ఎక్కడో ఉండి మనలను పీడించడం ఉండదు. అసురులు అనగా మన మనసులో కలిగే ఆలోచనా శక్తినిబట్టి వారు ఆసురీ ప్రవృత్తి కలవారా? లేక ఇంకొకరా? అన్నది తెలుస్తుంది. అనగా ఈ తల్లులకు మనలో కలిగే దుష్టమైన ఆలోచనలను సరిఅయిన మార్గంలో పెట్టగలిగే శక్తి ఉన్నది. అదీ ఎప్పుడు? అమ్మా! నేను నీ వాడను అన్నప్పుడే.


ఈ తల్లియొక్క వాహనము గరుడవాహనము. గరుడుడు రెక్కలు అల్లార్చుకుంటూ వస్తూఉంటే వేదనాదం వినిపిస్తుంది కనుక జ్ఞ్యానప్రదాయిని. అంత గొప్పదైన నామము కనుకనే మనము ఈ శరన్నవరాత్రులలో ఈ నామాన్ని ఉచ్చరించి కొంత శక్తిని పొందగలుగుతాము. లేకపోతే ఈ నామాన్ని గురించి ఆలోచించం కదా?


"జయ జయ శంకర హర హర శంకర"


'అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే'


సర్వేజనా సుఖినోభవంతు


శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి

WhatsApp Number: +91 8886240088

కామెంట్‌లు లేవు: