శ్లోకం
భీష్మ ఉవాచ
దైవం పౌర్వాహ్ణికం కుర్యాద్
అపరాహ్ణే తు పైతృకమ్ !
మంగలాచారసంపన్న:
కృతశౌచ: ప్రయత్నవాన్ !!
మనుష్యాణాం తు మధ్యాహ్నే ప్రపద్యాదుపపత్తిభి: !
కాలహీనం తు యద్ దానం
తం భాగం రాక్షసాం విదు: !!
మనుష్యుడు శుభాచార సంపన్నుడై స్నానాధికం చేసి పవితృడై, ప్రయత్నవంతుడై పూర్వాహ్ణంలో దేవ సంబంధ దానాలను, అపరాహ్ణంలో పితృసంబంధ దానాలను మధ్యాహ్న కాలంలో మనుష్య సంబంధ దానాలను చేయాలి. వేళ పాటింపక చేసిన దానం రాక్షస భాగ మవుతుందంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి