????? ఆలోచనాలోచనాలు ????? ------౦ విజ్ఞానం ౦------ 1* విజ్ఞానం పొందేందుకు మొదటి మెట్టు ఏమిటంటే మనకేమీ తెలియదని తెలుసుకోవడం. 2* మనకు స్వల్పంగా తెలిసినప్పుడే మనం ఖచ్చితంగా తెలుసుకొంటాం. మనలో విజ్ఞానం పెరిగేకొద్దీ దాని నిష్పత్తి లో సందేహాలు కూడా పెరుగుతుంటాయి. 3* మీరు విజ్ఞానం సంపాదించాక దానిని సద్వినియోగం చెయ్యాలి. మీలో విజ్ఞానం లేదనుకోండి, అప్పుడు అయ్యా ఈ విషయంలో పూర్తిగా అమాయకుడినని పూర్తిగా ఒప్పుకోవాలి. 4* ఇతరుల లోపాలను చూసి తానొక జ్ఞానినని అహంకరించేవాడు నిజమైన అజ్ఞాని. ఎందుకంటే అతడెన్నడు తనకుగల అజ్ఞానాన్ని గురించి బేరీజు వేసుకోలేదు. 5* విజ్ఞానమొక శక్తి అంటాడు, బేకన్ మహాశయుడు. కానీ విజ్ఞానాన్ని కలిగి ఉండడం మాత్రమే శక్తి కాదు. దానిని ఆచరణలో పెట్టడమే నిజమైన శక్తి. 6* నాకంటే ఎక్కువ తెలిసినవారిపై నాకు అసూయ లాంటిది ఏదీ లేదు. కానీ నాకంటే తక్కువ తెలిసిన వారిపై నాకెంతో జాలి. 7* విజ్ఞాని ఎప్పుడూ శక్తి సంపన్నుడే. అతడు ఎప్పుడూ తన శక్తిని, బలాన్ని పెంచుకొంటూనే ఉంటాడు. 8* ధనదాహం మాదిరిగానే విజ్ఞానవాంఛ కూడా అది పొందేకొద్దీ పెరుగుతూ ఉంటుంది. 9* కనుపించే ఒంటె నుండి, కుండ నుండి, మూర్ఖుని నుండి, పురుగుపుట్రానుండి, చివరకు పాత చెప్పు నుండి కూడా మనం నేర్చుకోవలసిన విజ్ఞానం ఎంతో ఉంటుంది. 10* విజ్ఞానాన్ని ఒంటరిగా సంపాదించుకోవచ్చు. కానీ దాన్ని ప్రజోపయోగకోసం మాత్రమే ఉపయోగించాలి. 11* విజ్ఞానాన్ని వివేకంగానూ, ఇంగితజ్ఞానంగానూ మార్చుకోలేకపోతే ఆ విజ్ఞానం వలన ప్రయోజనం ఏమిటి? 12* నీకు తెలిసిన ప్రతి విషయాన్ని ఇతరులకు చెప్పు, లేదా బోధించు. లేకపోతే అది ఉండి కూడా వ్యర్థమే కదా! 13* విలువైన వస్తువు లాగే విజ్ఞానాన్ని కూడా సులభంగా సంపాదించలేం. విజ్ఞానార్జన కోసం కృషి చెయ్యాలి. అధ్యయనం చెయ్యాలి. తీవ్రంగా ఆలోచించాలి. అన్నింటికన్నా ముఖ్యం దాని కోసం ప్రార్థించాలి. 14* నీవు తెలుసుకోకుండా ఉండటానికి ఈ భూమిపై అల్పాతి అల్పమైన విషయం అంటూ ఒకటి లేదు. 15* అజ్ఞానం అన్నది దేవుడు ఇచ్చిన శాపం. విజ్ఞానం అనేది రెక్కల వంటిది. ఈ రెక్కల సాయంతో మనం స్వర్గానికి కూడా ఎగిరి వెళ్ళవచ్చు. * * * * * * * * * * * * * * * * * * * * * Answers to sharpen your mind ! 1* Hairy Potter. 2* Because they keep drawing. 3* Onion. 4* A chess player. * * * * * * * * * * * * * * * * * * * * * తెలుగు వారి స్వంతం ( పొడుపు కథలు- విడుపులు) 1* సంవత్సరం మొత్తంలో రెండు కొడతాయి. ఒకటేమో పెడుతుంది? ( ఎండ వానలు మరియు చలి ) 2* రెండు కొండల మధ్య సీతమ్మ చీర. ఎంతకూ ఆరదు. ( నోట్లోని నాలుక) 3* ఏరుమీద ఎర్రని సూర్యబింబం. నాకు కనబడుతుంది. నీకు మాత్రం కనబడదు. ఏమిటది? ( నుదిటి బొట్టు) 4* యంత్రం కాని యంత్రమది. రోజుకొకసారి మాత్రమే కన్పిస్తుంది. ఏమిటది? (సాయంత్రం) 5* అది రాజుగారి తోటలో పువ్వు. అన్నకు అందదు. కానీ తమ్ముడికి అందుతుంది. ( పెదవులు) తేది 1--9--2023, శుక్రవారం, శుభోదయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి