1, సెప్టెంబర్ 2023, శుక్రవారం

వాలీసుగ్రీవుల సూర్యేంద్రుల అనుబంధం

 మహాభారతములో కర్ణార్జునుల సూర్యేంద్రుల అనుబంధం అందరికీ విదితమే కావొచ్చు కాని వాలీసుగ్రీవుల సూర్యేంద్రుల అనుబంధం బహుశా అంతగా లోకప్రాశస్త్యము పొందకపోయుండొచ్చు. వారి కథనం ఇదిగో. 


వాలి, సుగ్రీవుడు వృక్షవ్రజస్సు అనే గొప్ప వానర రాజుకి పుట్టిన సంతానం. 


ఒకసారి వృక్షవ్రజస్సు ఒక తటాకంలో స్నానం చేస్తాడు, ఆ తటాకంకి ఉన్న శాపప్రభావం వల్ల వృక్షవ్రజస్సు ఒక అప్సరసగా మారిపోతాడు.  అప్పుడు ఆ ప్రదేశంలో సూర్యుడు, ఇంద్రుడు ఆ అప్సరసగా ఉన్న వృక్షవ్రజస్సు చూసి మోహితులై వాల భాగంలోను, కంఠ భాగంలోను వీర్యాన్ని విడిచి పెడతారు. దానికి వృక్షవ్రజస్సు కంగారు పడుతున్న సమయములో బ్రహ్మ వచ్చి వీర్యం విడవడం వల్ల వాలి సుగ్రీవులు జన్మిస్తారని చెప్పారు. 


వాల భాగములో వీర్యం వదలడం వల్ల వాలి, కంఠ భాగం లలో వదిలిన వీర్యం వల్ల సుగ్రీవుడు జన్మిస్తారు.


ఇదే వాలి సుగ్రీవుల జనన వృత్తాంతము.

కామెంట్‌లు లేవు: