*1903*
*కం*
గతమెంతగ వ్యర్థపడిన
సతతము జని ఘనతలెల్ల సాధించుటకై
వితతము కాలము కూర్చును
హితమగు నవకాశములను హెచ్చుగ సుజనా.
*భావం*:-- ఓ సుజనా! గతించిన కాలం వృధా అయినప్పటికీ ఎల్లప్పుడూ గొప్ప పనులు చేయడానికి అనుకూలమైన అవకాశాలను ఎక్కువగా కాలము ఇస్తూ ఉంటుంది.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి