12, సెప్టెంబర్ 2023, మంగళవారం

అవగాహన కోసం


 *నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు ముఖ్య గమనిక🙏*


*నా అకౌంట్ నుంచి 40,000 రూపాయలు ఎవరో విత్ డ్రా చేశారు..*


*వెంటనే ఎస్బిఐ కస్టమర్ కేర్ వారితో మాట్లాడటం జరిగింది... వారు వెంటనే సిస్టంలో చూసి, ఇది సైబర్ మోసగాళ్లు పని అని తేల్చేశారు..*


*నేను ఎటువంటి ప్రైవేట్ లింక్ లు క్లిక్ చేయను.. ఎటువంటి ఓటిపి లను కూడా ఎవరికి షేర్ చేయను...*


*నేను పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని...*


*మరి నా డబ్బులు ఎవరు? ఎలా? డ్రా చేయగలిగారు? అని అడిగాను...*


*ఏటీఎం, నెట్ బ్యాంకింగ్, ఫోన్ పే, అన్ని బ్లాక్ చేశాను..*


*క్రైమ్ బ్రాంచ్ వారికి, బ్యాంక్ మేనేజర్ కి మరియు పోలీస్ స్టేషన్ వారికి కంప్లైంట్ చేశాను...* 


*చివరగా నాకు తెలిసిందేమిటంటే... నా తంబ్ ఆథెండికేషన్ ద్వారా(ఆధార్ అతనితోకేషన్) డబ్బులు విత్ డ్రా చేస్తున్నారు...*


*ఇటీవల కాలంలో మీరు ఎక్కడైనా తంభ్ వేశారా?.. అని క్రైమ్ బ్రాంచ్ వారు నన్ను అడిగారు....*


*ఒక ఎనిమిది నెలల క్రితం నా మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం రిజిస్టర్ ఆఫీస్ లో తంబ్ వేశాను... హ్యాకర్స్ వాటిని హ్యాక్  చేశారు.....*


 *తంబ్ ఆథెంటిఫికేషన్ ద్వారా డబ్బులు డ్రా చేసినప్పుడు... మనకు ఓటీపీ గాని మెసేజ్ గాని రాదు...*


*ఇదే ఈ సైబర్ మోసగాళ్లకు అనుకూల అంశం...*


ఈ విషయంపై నేను బ్రాంచ్ మేనేజర్ ని కలిసినప్పుడు... ఆయన స్పందిస్తూ... ఇటీవల కాలంలో ఇలాంటి మోసాలు చాలా ఎక్కువ అవుతున్నాయని... ఇలాంటి కంప్లైంట్స్ కూడా మాకు వస్తున్నాయని... అందరూ అప్రమత్తంగా ఉండాలని... ముఖ్యంగా ఇల్లు కొనుగోలు, ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసిన సందర్భంలో.... మరియు ఇతర సందర్భంలో ఎక్కడైనా మన తంబ్ వేసినప్పుడు సైబర్ మోసగాళ్లు ఇదే అదునుగా మన తంబ్ లను హ్యాక్ చేసి... దుర్వినియోగం చేస్తున్నారు......*


*అందుకే ఆధార్ పోర్టల్ లో, మై ఆధార్ అనే ఆప్షన్ లో మన ఆధార్ ని బ్లాక్ చేసి ఉంచుకోవడం మంచిది...*

[12/09, 7:16 am] chalapathi rao: ఈ సంఘటన నాకే జరిగింది


నా ఎకౌంటుSBI, GAJAPATHINAGARAM లో కలదు..


కె రామకృష్ణ

[

*చిట్ట చివరగా నాకు తెలిసిందేమిటంటే... నా డబ్బులు తిరిగి రావు...*


*భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండాలంటే నా ఆధార్ ని లాక్ చేశాను...*


*మీరు కూడా ఎక్కడైనా తంబ్ వేసి ఉంటే మీ ఆధార్ ని వెంటనే లాక్ చేయండి...(అవసరమైనప్పుడు మరల ఓపెన్ చేసుకోవచ్చు)*


*నా ఆత్మీయులుగా... మీకు ఇలాంటి సంఘటన జరగకూడదని, అప్రమత్తం అవుతారని ఈ విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను...*


*కె రామకృష్ణ*

 మోసపోకుండా ఉండటం కోసం. అవగాహన కోసం మాత్రమే.

కామెంట్‌లు లేవు: