🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం -20*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*కిరన్తీ మంగేభ్యః కిరణ నికురుంబామృతరసం*
*హృది త్వా మాధత్తే హిమకర శిలామూర్తి మివ యః |*
*స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ*
*జ్వరప్లుష్టాన్ దృష్ట్వా సుఖయతి సుధాధార సిరయా ||*
ఇది అమృతేశ్వరీ మంత్రం. ఆవిడే అన్నపూర్ణ లలిత. ఆవిడ ఎలా వుంది?
ఆర్ద్రంగా ఉందట. అంటే దయ, హృదయంలో తేమ, కలిగియుందట. అమ్మవారి నామాల్లో *నిత్యక్లిన్నా* అనే నామానికి అర్ధం ఎప్పుడూ ఆర్ద్రత కలిగియుండేది అని. అలాగే శ్రీ సూక్తంలో కూడా *ఆర్ద్రాం* అని చెప్తాము.
ఇప్పుడు శంకరులు అమ్మవారి ఆర్ద్రతను చంద్రకాంత శిలలతో పోల్చారు.
హిమకర శిలామూర్తిమ్ ఇవ యః = ఆర్ద్రంగా ఉండటమే కాక కిరణాలను కూడా వెదజల్లుతున్నదట
కిరన్తీ మంగేభ్యః = కిరణములేకాక జ్ఞానాన్ని కూడా ప్రసరింపజేస్తున్నది.
కిరణ నికురుంబామృతరసం = ఈ విధంగా హృదయంలో ధ్యానిస్తే(హృది త్వా మాధత్తే)
శకుంతాధిప ఇవ = గరుడుని వలె
స సర్పాణాం దర్పం శమయతి = సర్పముల దర్పమును పోగొట్టుతారు అమ్మవారు. సర్ప దర్పము అంటే విషము.ఇక్కడ అన్వయం విషపూరిత వ్యాధులు (వైరల్ రోగాలు,ఇప్పటి కొరోనా వైరస్ లాగా) పోగొట్టుతుంది అని.
అంతే కాక ఈ విధంగా ధ్యానం చేసి సిద్ధిని పొందిన వారు
జ్వరప్లుష్టాన్ దృష్ట్వా సుఖయతి = రోగిని చూస్తే ఆ రోగికి ఉపశమనం కలుగుతుంది.
సుధాధార సిరయా = సిర అంటే గోవు పొదుగుకు వున్న పాలను వర్షించే చన్ను. మనలోని ప్రధాన నాడి సుషుమ్న. అది అమృతత్త్వాన్ని సాధించే నాడి. ఈ నాడిలోని అమృత ధార పైన చెప్పిన సిర వలె ఈ అమృత సిద్ధిని పొందిన మహానుభావుల దృష్టి ద్వారా వాక్కు ద్వారా ఇతరుల వ్యాధులను పోగొట్టుతుంది. శ్రీ కంచి మహాస్వామివారి వలె.
ఈ అమృతేశ్వరి మంత్రం ఆరోగ్యాన్నిస్తుంది. కరువు కాటకాలు వున్న చోట్ల జపిస్తే వర్షాలు ధారాళంగా పడుతాయి.
ఒకప్పుడు సంగీత త్రిమూర్తులలోని ముత్తుస్వామి దీక్షితార్, కాంచీపురం మండలంలో కరవును పారద్రోలటానికి ఆనందామృత వర్షిణీ, హరాదిపూజితే, శివా భవానీ అని గానం చేస్తూ, చివరిలో "సలిలం వర్షయ వర్షయ.. అనగానే కుంభవృష్టి కురిసి ఆ ప్రాంతం సస్య శ్యామలం అయిందట. అంత శక్తి కలదీ మంత్రం/శ్లోకం.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి