12, సెప్టెంబర్ 2023, మంగళవారం

మదవీమూర్ధాభిషేకము

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸



శ్రీ కాళహస్తీశ్వర శతకం - 90




మును నీచే నపవర్గరాజ్యపదవీ మూర్ధాభిషేకంబు గాం

చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో చింతించి చూడంగ నెట్లనినంగీటఫణీంద్రపోతమదవే దండోగ్రహింసావిచా

రిని గాంగాఁ నిను గానఁగాక మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!



తాత్పర్యం:



శ్రీ కాళహస్తీశ్వరా! ఇంతకుముందు నీచేత అపవర్గమను (ముక్తి) రాజ్యపదమునందు మూర్ధాభిషేకము నందుకొనిన మహనీయులు కొందరుండిరి కదా....


ఆలోచించి చూడగ వారు నేను ఒక్క సాటివారమే. కాని నేను ఆ మహనీయుల స్థితిని పొందలేకపోతిని. 


నేను నా అజ్ఞానముతో పురుగుగానో పాముగానో మదపుటేనుగుగానో హింసాజీవుడగు బోయగానో ఐనను చాలునన్న లక్ష్యముతో నిన్ను నాపూర్వజన్మముల యందు ధ్యానించి యుండలేదు కాబోలు. 


అందుకే అట్టి జన్మము రాక అపవర్గ

మదవీమూర్ధాభిషేకము పొందజాలకపోతిని.



ఓం నమః శివాయ


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

కామెంట్‌లు లేవు: