16, మే 2024, గురువారం

దక్షిణావర్తి శంఖం

 దక్షిణావర్తి శంఖం యొక్క ప్రత్యేకత - 1


       శంఖములలో రెండు రకాలు కలవు . అవి 


  * వామావర్తి శంఖము . 


  * దక్షిణావర్తి శంఖము . 


     పైన చెప్పిన రెండురకాల శంఖాలలో దక్షిణావర్తి శంఖం సులభముగా లభ్యం అగును. ఇది ఒక మంచి తాంత్రిక వస్తువు . దీనిని పూజలలో మహాలక్ష్మితో సమానంగా భావించెదరు . 


        తంత్రగ్రంధాల ప్రకారం వామావర్తి అంటే ఎడమ చేయి వైపు "కడుపు" కలది అనగా ఎడమచేయి వైపు తెరిచి ఉండేది అని దక్షిణావర్తి అంటే కుడివైపు తెరచి ఉండేదని అర్థం . 


          ఇప్పుడు శంఖాల గురించి కొంత వివరణ మీకు ఇస్తాను . శంఖం అనేది " ఘోoఘా " అనే సముద్రజాతికి చెందిన జంతువు . ఇది తెరుచుకొని ఉన్న భాగమే దీని కడుపు లేక నోరు . తలవలే ఉండి ఊదే భాగం దానియొక్క పృష్ఠభాగం అంటే వెనక భాగం లేక తోకభాగం . దీనికే గుండ్రని కన్నం చేసి నోటితో ఊదుతారు. 


        దక్షిణవర్తి శంఖం అనేది చాలా ప్రత్యేకమైన తాంత్రిక వస్తువు . సముద్రము నందు జన్మించడం మూలాన శ్రీ మహాలక్ష్మితో పోల్చబడిన వస్తువు . సమస్త సిరులు , భోగభాగ్యాలు ప్రసాదించును . శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు వంటి వారు ఒక్క యుద్ధ సమయము నందు తప్ప మిగిలిన సమయాలలో పూజా మందిరము నందు ఉంచి పూజించేవారు . దీనిని లక్ష్మీదేవి సహోదరిగా చెప్పుదురు . ఇది అరుదుగా లభ్యం అగును . రామేశ్వరం , కన్యాకుమారి వంటి స్థలములలో తప్ప అన్య ప్రదేశాలలో దొరకదు . ఈ దక్షిణావర్తి శంఖం మోగదు . మోగేది దొరుకుట అదృష్టము మరియు కష్టం . దోషయుక్తం అనగా పగిలిన మరియు విరిగిన శంఖం ఇంటి యందు ఉంచరాదు . 


          తరవాతి పోస్టు నందు ఈ శంఖం పూజావిధానం సవివరంగా వివరిస్తాను . 


   

        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

కామెంట్‌లు లేవు: