16, మే 2024, గురువారం

హృదయ విదారకర సంఘటన

 నిన్న రాష్ట్రం లో జరిగిన ఒక హృదయ విదారకర సంఘటన హృదయాన్ని కలచివేసింది.

మనస్సున్న ప్రతిఒక్కరిని కంట నీరు పెట్టించింది.


*ఆరు(6) నెలల వయస్సున్న పసికందు నిద్రపోతువుంటే,పక్కింటి వాళ్ళ పెంపుడు కుక్క,ఆ బిడ్డ ను పీకి,పీకి చంపివేసింది*


*తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి బిడ్డ రక్తపు మాంసపు ముద్దగ మారి,మరణించింది.*

*ఆ శునకాన్ని కొట్టి చంపేశారు*.


1) కుక్కల్ని పెంచేవారు,వాటిని తగు రీతిన తమ అదుపు,ఆజ్ఞ లో వుంచు కోవాలి.

2) కొంతమంది గొలుసు కట్టి ఉదయం పూట వాకింగ్ కి కుక్కని తీసుకు వస్తారు.రోడ్డు మీద నడిచే కొందరికి ప్రాణ సంకటం గా వుంటుంది.

3) మన కుక్క మనకి ముద్దు,పక్కవారికి ముద్దు కాదు.

4) పెంపుడు కుక్కలు కొంతమంది అపార్టుమెంటులో కూడా పెంచి అందరికీ ఇబ్బంది కలుగ చేస్తున్నారు.

5) మన పెంపుడు కుక్క మనల్ని ఏమి చేయదు,కాని పక్క వారిని తప్పకుండా కోపం గా చూస్తోంది.

6) ఎంతయినా జంతువు, జంతువే.


*కుక్కలంటే నాకు ఇష్టమే.నేను కుక్కని పెంచటానికి వ్యతిరేఖం కాదు.*


*జంతు ప్రేమికులు అందరికీ వందనాలు.*

 జంతువు కన్న సాటి మనిషి ముఖ్యం.

మనమందరం మనుషులం.

అందరికీ వందనాలు.....🙏🙏


*మూర్తి's కలం నుండి....✒️*...

(సీనియర్ ఫిజిక్స్ లెక్చరర్,కాలమిస్ట్)

కామెంట్‌లు లేవు: