16, మే 2024, గురువారం

నీరు కొబ్బరికాయలో

 సుభాషితం:


అజగామ యథా లక్ష్మీ: - నారికేళ


ఫలాంబువత్1


నిర్జగామ యథా లక్ష్మీ: - గజభుక్త కపిత్థవత్11


తేటగీతి:


నీరు కొబ్బరికాయలో చేరునెట్లొ మన కెరుకలేక సిరియట్లె మనకు వచ్చు; మన కెరుక లేకయే పోవు మన ధనంబు పరగ కరి మింగిన వెలగపండు వోలె.


భావం: కొబ్బరికాయలో నీరు ఎలా


చేరుతుందో.. సిరి సంపదలు మనకు తెలియకుండానే అలా వస్తాయి. సిరి సంపదలు పోయేటప్పుడు కూడా అంతే. కరి మింగిన వెలగపండు చందంగా ఖాళీ అవుతాయి.


ఉదయం 6:37

కామెంట్‌లు లేవు: