16, మే 2024, గురువారం

ధరణి లుబ్ధుని

 సుభాషితమ్


శ్లో॥ లుబ్ధమర్థేన గృహ్ణీయాత్ స్తబ్ధమంజలి కర్మణా* । 

     *మూర్ఖం ఛన్దోఽను వృత్తేన యథార్థత్వేన పండితమ్* 11


తా॥ ధనమునందాసక్తిగల లోభిని ధనముద్వారా, అహంకారిని నమస్కారము ద్వారా, మూర్ఖుని ఆతని కోరిక ననుసరించి పనిచేసియు, బుద్ధిమంతుడైన వానిని సత్యవచనముల ద్వారా వశపఱచుకొనవలెను.



తే.

ధరణి లుబ్ధుని కరయంగ ధనము నిచ్చి 

అహముతో నున్న వానికి నంజ లిడియు 

అనయముగ మూర్ఖు మాటల ననుసరించి

పలికి సత్యము నిరతమ్ము పండితుడిని 

జగతి మన్నింప వలయు తా సజ్జ నుండు


తెనుగు సేత :

✍️గోపాలుని మధుసూదన రావు 🙏

కామెంట్‌లు లేవు: