**
*కం*
ఓర్పున సంస్కారంబుల
నేర్పినచో పిల్లలటుల నేరిచి నెగడున్.
నేర్పకనే చెడు బుధ్ధులు
కూర్పుగ చిన్నారుల మది కూడును సుజనా.
*భావం*:-- ఓ సుజనా! ఓపిక తో సంస్కారములను పిల్లలకు నేర్పినచో అవి నేర్చుకొని పిల్లలు వర్ధిల్లును(బాగుపడును). ఏమీ నేర్పకపోతే పిల్లల మనస్సులకు చెడ్డ బుధ్ధులు వాటంతట అవే వచ్చి చేరును.
*సందేశం*:-- పిల్లలకు మంచి సంస్కృతీ సంప్రదాయాలు నేర్పకపోతే చెడులక్షణాలు పొంది వారు చెడిపోయే ప్రమాదం ఉంటుంది.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి