మన బలహీనత పరమేశ్వరుడికి చెప్పగలిగితే శరణాగతి. ఎందఱో పెద్దలు వెళ్ళి భగవంతుడి AA దగ్గర చెప్పుకున్నారు. ఈశ్వరా! నాకు చిత్తశుద్ధిని ఇవ్వు. దుర్మార్గపు బుద్ధి వద్దు. పైకి ఒకలా కనబడుతూ చెరువులో నిలబడిన కొంగ ఒంటికాలి మీద నిలబడి తెల్లగా ఉండి జపం చేస్తున్నట్లుగా ఉండి చేపపిల్ల కనబడితే చటుక్కున ఎత్తుకు పోయినట్లు నేను ఏ పంచ కడితేనేం? ఏ లాల్చీ కడితేనేం? ఎంత విభూతి పెడితేనేం? ఎంత బొట్టు పెడితేనేం? ఈశ్వరా! లోపల మనస్సు శుద్ధం కావట్లేదు. నన్ను ఈడ్చేస్తోంది. పరమేశ్వరా! జోక్యం చేసుకొని కాపాడాలి నన్ను నువ్వు అని అడిగితే నీ సాధనలో నువ్వు ఉంచుకోలేకపోతే ధర్మాన్ని నువ్వు పట్టుకోలేకపోతే అప్పుడు ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. నిజంగా నిన్ను బాధ పెడుతున్నది ఏదో ఎందుకు ధర్మాన్ని పట్టుకోలేకపోతున్నావో ఏది నిన్ను ఈడ్చేస్తుందో అది భగవంతుడితో చెప్పు. నీకు మనస్సు ఇచ్చిన వాడు, బుద్ధిని ఇచ్చినవాడు, ఇంద్రియములను ఇచ్చిన వాడు, శాస్త్రమును ఇచ్చినవాడు, గురువును ఇచ్చినవాడు, వేదములు ఇచ్చిన వాడు, ధర్మమును చెప్పినవాడు, వాడు. ఆయన చెప్పింది పట్టుకోలేకపోతే ఆయనకి చెప్పు. ఆయన జోక్యం చేసుకుంటాడు. నీ మనస్సును శుద్ధి చేస్తాడు. నీ మనస్సు మారుస్తాడు, నువ్వు ధర్మం పట్టుకొనేటట్లు చేస్తాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి