10, అక్టోబర్ 2020, శనివారం

శ్రీమహావిష్ణు_సహస్రనామ_వైభవము-27💠🕉️

 

                ☸️శ్లోకం 21☸️


మరీచి ర్దమనో హంసః సువర్ణో భుజగోత్తమః|

హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః


191. మరీచిః --- కాంతి, కిరణము, తేజోమయుడు; తేజోవంతులలో దివ్యతేజోమూర్తి.

192. దమనః --- సంసార భారమును తొలగించి, బంధ విముక్తినొసగువాడు; అధర్మమార్గమున చరించువారిని శిక్షించువాడు; తన దివ్య తేజస్సుచే సమస్త ప్రాణుల తాపములను హరించువాడు.

193. హంసః --- భక్తులకు సంసార భయమును పోగొట్టువాడు; హంసవంటి గుణములు గలవాడు, హంసావతారమును ధరించినవాడు; సోహం అని తెలిపిన పరబ్రహ్మము; అన్ని శరీరములందలి అంతర్యామి.

194. సుపర్ణః --- చక్కనైన రెక్కలు గలవాడు (గరుత్మంతుడు, హంస) ; జ్ఞానము, కర్మ అను అందమైన రెక్కలనధిరోహింపజేసి సంసార సాగరమును తరింపజేయువాడు.

195. భుజగోత్తమః --- ఆదిశేషునకు ప్రభువు, శేషశాయి; సర్పములలో ఉత్తముడు (అనంతుడు, వాసుకి) ; వ్యాపనము, చలనము కలిగినవానిలో ఉత్తముడు (సర్వవ్యాపి).

196. హిరణ్యనాభః --- బంగారమువంటి, కళ్యాణప్రథము, మనోహరమునగు నాభియందు చతుర్ముఖ బ్రహ్మకు ఆధారమైనవాడు; బ్రహ్మను కన్న తండ్రి.

197. సుతపాః --- అత్యుత్తమ జ్ఞానమునకు ఆలవాలము; మూర్తీభవించిన తపము; బదరికాశ్రమమున నరనారాయణ రూపమున గొప్ప తపసు నాచరించినవాడు.

198. పద్మనాభః --- బొడ్డు తామరపూవు గలవాడు (బ్రహ్మకు జన్మస్థానము) ; అందరి హృదయ కమలములందు వసించువాడు; జ్ఞానమునకు నిలయము; బహు మనోహరుడు.

199. ప్రజాపతిః --- సకలజీవులకును ప్రభువు; బ్రహ్మాదులకు ప్రభువు.


శ్లో. మరీచి ర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః


హిరణ్య నాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః 21


43.కాంతి మంతుడతడు, కటుకుల దమనుడె


హంస యనగవచ్చు, నరయ రెండు


ఆత్మ లన్న నతడె, ఆదిశేషుడు గాగ


వందనాలు హరికి వంద వేలు !!


{ అర్థాలు : మరీచి ... కాంతిమతుడు, దమన .. దండించువాడు, తద్వారా దారిలో పెట్టువాడు, హంస ... జీవాత్మ, మరియూ పరమాత్మ, సుపర్ణ ... అందమైన రెక్కలు అవియే ఆత్మ పరమాత్మ, భుజగోోోత్తమ ...అనంతుడు.


భావము : సూర్య చంద్రులకు సైతం వెలుగు నందించే కాంతిమంతుడు, కటుకులను అనగా దుష్టులను దండిస్తూ, జన హృదయాలలోని చెడు గుణాలను పారద్రోలి దారిలో పెట్టేవాడు, ప్రాణులలో జీవము అయిన వాడు( ప్రాణం పోగానే హంస యెగిరిపోయందనడం మానవ నైజం కదా) లేదా " అహం బ్రహ్మ" అనీ అనుకోవచ్చు అలా అనుకున్నా బ్రహ్మమే జీవం కదా, జీవాత్మ పరమాత్మ అనే రెండు అందమైన రెక్కలున్నవాడు( ఆ రెక్కలే భక్తి, జ్ఞానం అనీ వాటిని చాపుతూ తన భక్తులను కాపాడుతుంటాడని మరొక భాష్యం), భుజంగాలలో అనగా పాములలో ఎన్నదగినవాడు అంటే ఆదిశేషుడు లేదా అనంతుడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. )


44. పసిడి యైన నాభి, పరమహంస యతడె,


పద్మమంటి నాభి, పరమ పురుష


స్వామి యతడె చూడ సకల జగతికిని


వందనాలు హరికి వంద వేలు !!


{ అర్థాలు : హిరణ్య గర్భ ... బంగరు నాభి, సుతపా ... ఉత్తమ తాపసి, పద్మనాభ ... పద్మము వంటి నాభి గలవాడు, ప్రజాపతి ... ప్రజలకు అధిపతి.

భావము : బ్రహ్మ దేవునికి జన్మనిచ్చిన స్వర్ణమయమైనటువంటి నాభి గలవాడు, తాపసులలో మిన్నయైనవాడు అనగా పరమహంసలాంటివాడు, పద్మము వంటి నాభి గలవాడు, సకల జగత్తుకు (ప్రజలకు) అధినాథుడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. )


-ఓం నమో నారాయణాయ


**ధర్మము - సంస్కృతి**

కామెంట్‌లు లేవు: