10, అక్టోబర్ 2020, శనివారం

నిర్వాణ షట్కము. శ్రీ ఆదిశంకరులు.

 మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం

న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే

న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః

చిదానందరూపః శివోహం శివోహం

చిదానందరూపః శివోహం శివోహం



నేను మనస్సు కాదు - నేను బుద్ధి కాదు - నేను జ్ఞానం కాదు - నేను అహంకారం కాదు

నేను - చెవి, నాలుక, ముక్కు, కన్ను - ఇందులో ఏ ఇంద్రియమూ కాదు

నేను - ఆకాశం, భూమి, అగ్ని, వాయవు - ఏదీ కాదు

నేను - ఆనందరూప చిత్తమయిన - శివుణ్ణి



                                                                                 2

న చ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయుః

న వా సప్తధాతుః న వా పంచకోశః

న వాక్పాణిపాదం న చోపస్థపాయుః

చిదానందరూపః శివోహం శివోహం

చిదానందరూపః శివోహం శివోహం

 

 



నేను - ప్రాణానికి ఉనికి కాదు - ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన మొదలైన పంచ వాయువులు కాదు

నేను - రస, రక్త, మాంస, మేద, అస్థి, మజ్జ, శుక్ర - మొదలైన సప్తధాతువులు కాదు; నేను - అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాది పంచకోశాలు కాదు

నేను - మాట, చేయి, పాదం, విసర్జకావయవాలు - ఏదీ కాదు

నేను - ఆనందరూప చిత్తమయిన - శివుణ్ణి


టెక్

                                                                                  3

న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ

మదో నైవ మే నైవ మాత్సర్యభావః

న ధర్మో న చార్థో న కామో న మోక్షః

చిదానందరూపః శివోహం శివోహం

చిదానందరూపః శివోహం శివోహం



నాకు - ద్వేషం, అనురాగం, లోభం, మోహం - ఏదీ లేదు

నాకు - మదం (గర్వం), అసూయ - లేవు

నాకు - ధర్మార్థ కామ మోక్షాలు - ఏవీ లేవు

నేను - ఆనందరూప చిత్తమయిన - శివుణ్ణి



                                                                                4

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం

న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా

అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా

చిదానందరూపః శివోహం శివోహం

చిదానందరూపః శివోహం శివోహం



నాకు - పుణ్యం, పాపం, సుఖం, దుఃఖం - ఏవీ లేవు

నాకు - మంత్రం, పుణ్యతీర్థం, వేదం, యజ్ఞం - ఏవీ లేవు - దేనికీ నేను బద్ధుడిని కాదు

నాకు అనుభవం లేదు - నేను అనుభవించబడునది కాదు - నేను అనుభవించువాడను కాదు

నేను ఆనందరూప చిత్తమయిన శివుణ్ణి



                                                                               5

న మే మృత్యుశంకా న మే జాతి భేదః

పితా నైవ మే నైవ మాతా న జన్మః

న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యం

చిదానందరూపః శివోహం శివోహం

చిదానందరూపః శివోహం శివోహం



నాకు - మరణమంటే భయం లేదు - జాతి భేదం లేదు

నాకు - తండ్రి లేడు - తల్లి లేదు - జన్మ లేదు

నేను - బంధువులు కాను - స్నేహితుడిని కాను - గురువును కాను - శిష్యుడిని కాను

నేను - ఆనందరూప చిత్తమయిన - శివుణ్ణి



                                                                               6

అహం నిర్వికల్పో నిరాకార రూపః

విభుర్వ్యాప్య సర్వత్ర సర్వెంద్రియాణాం

సదామే సమత్వం న ముక్తిర్న బంధః

చిదానందరూపః శివోహం శివోహం

చిదానందరూపః శివోహం శివోహం



నాకు - మార్పు లేదు - ఆకారం లేదు

నేను - అన్ని ప్రదేశాలలో - అన్ని ఇంద్రియాలలో - వ్యాపించి వున్నాను

నాకు - అన్నిటా సమదృష్టి ; నాకు - బంధము లేదు - నాకు విముక్తి లేదు

నేను ఆనందరూప చిత్తమయిన శివుణ్ణి

కామెంట్‌లు లేవు: