10, అక్టోబర్ 2020, శనివారం

హస్త సామూద్రికం


చేతి వేళ్ళలో శంఖుచక్రాలు ఉంటాయని వాటిని బట్టి మనిషి పొందే భోగాలు తెలుసుకోవచ్చునని మా నాన్న మా చిన్నప్పుడు చెపుతూ కింది శ్లోకం చెప్పేవాడు.


ఏకచక్రే మహ భోగి ద్వీ చక్రే గృహ పూజిత : త్రిచక్రే మనస్తాపంచI

చతుర్చక్రే పండిత : పంచ చక్రే సాధు సన్యాసి షడ్చక్రే మహభోగి

సప్తచక్రే బల పరాక్రమ: అష్టమ చక్రే ధ్వారాకారంచ

నవచక్రే రాజపూజిత : దశమ చక్రే దాత రాజపూజిత : యితి లక్షణం హస్తచక్రం :

... ... ... ... ...


చేతి చివరి వ్రేళ్ళలో ఒక చక్రం ఉంటే మహభోగి గా ఉంటాడు.

తాను సన్మార్గం అనుభవించి ఇతరులను అనుభవింప చేస్తాడు.

రెండు చక్రాలుంటే ఇంట్లో అందరూ గౌరవంగా చూస్తారు. అందరూ గౌరవించారంటే సదా వర్తనుడని అర్ధం.

మూడు ఉంటే తిరుగుబోతు, తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచినట్టు, నమ్మిన వారిని తన భాటలో నడిపిస్తాడు.

నాలుగు ఉంటే పండితుడుగా విలసిల్లుతాడు.

ఐదు ఉంటే గొప్ప సన్యాసిగా మారుతాడు.బహుశా పెండ్లి తర్వాతనేమో.

ఆరుంటే మహయోగి, 

ఏడు చక్రాలు ఉంటే బలవంతుడు, కండ పుష్టె కాకుండా ధన అధికార జనసంపద కలిగినవాడు గా ఉంటాడు.

ఎనిమిదుంటే కష్ట జీవిగా ఉంటారు.

తొమ్మిది ఉంటే రాజు అవుతాడు.

10 ఉంటే ప్రధాన మంత్రి అవుతాడు.

please check and decide what you are..

అన్ని లక్షణాలు సరిగా ఉండి బికారిగా ఉన్నాడేమిటని జ్యోతిష్యుని ప్రశ్నిస్తే పూర్వజన్మ ప్రారబ్దం అనుభవించాలని తప్పించుకొంటాడు.

................................................................................

కామెంట్‌లు లేవు: