10, అక్టోబర్ 2020, శనివారం

తలపులు ఏ విధంగా మనసులో చేరుతాయి

 *"తలపులు అసలు ఏ విధంగా మనసులో చేరుతాయి ?"*


*తలపు అంటే తెలిసిన సమాచారం. పసిపిల్లలుగా ఉన్నప్పుడు మన వద్ద ఏ సమాచారం వుండదు కనుక ఏ తలపులు రావు. వయసు పెరిగే కొద్దీ ప్రపంచంలోని విషయాలను భాషగా నేర్చుకొంటాము. అవే జ్ఞాపకాలుగా ముద్రితమై తలపులకు కారణమవుతాయి. చిన్నతనంలో పిల్లవాడికి తన తండ్రి ఆఫీసు నుండి ఆలస్యంగా రావటానికి కారణం తెలియదు కనుక ఊహించలేడు. ఒకసారి బస్సు టైర్ పంచరైనందువల్ల ఆలస్యం అయ్యిందని తెలుసుకుంటాడు. మరోసారి తండ్రి రావడం ఆలస్యమైతే అందుకు బస్సు టైర్ పంచరే కారణమని అనుకుంటాడు. తండ్రి వచ్చి తన స్నేహితుడి ఇంటికి వెళ్ళినందువల్ల ఆలస్యమైందని చెప్తే పాత సమాచారంతో పాటు ఇదికూడా జ్ఞాపకంగా నమోదవుతుంది. ఇంకోసారి తండ్రి ఆలస్యానికి బస్సు టైర్ పంచర్ గానీ, స్నేహితుల ఇంటికి వెళ్ళడం గానీ కారణమని భావిస్తాడు. వీటినే తలపులు అంటారు. ఇలా మనలో జ్ఞాపకంగా నమోదైన సమాచారంలో నుండి మనసులోకి వచ్చినదే తలపు. ముందు తలపు పుట్టి ఆ తర్వాత అది ఆలోచనగా మారుతుంది !*_


*"స్వస్వరూపం శాంతి - తలపులే అశాంతి !''*-

కామెంట్‌లు లేవు: