10, అక్టోబర్ 2020, శనివారం

జమ్మి పూజ ప్రాధాన్యత ఏమిటి

?

     విజయదశమి నాడు తప్పనిసరిగా జమ్మి చెట్టును అర్చించాలి. జమ్మిచెట్టు ఆవిర్భావం గురించి పురాణగాథలు ఉన్నాయి. బ్రహ్మ దేవుడు అగ్ని హోత్రాన్ని స్రుష్టించి నప్పుడు అగ్ని తన ధర్మాన్ని అనుసరించి స్రుష్టించిన బ్రహ్మనే దహించడం మొదలు పెట్టాడు. దాంతో అగ్ని తాకిడిని తట్టుకునేందుకు బ్రహ్మ ఒక చెట్టును స్రుష్టించాడు. అదే జమ్మి చెట్టు. అనంతమైన అగ్ని తత్వాన్ని తనలో ఇముడ్చుకున్న చెట్టు అది. అంతటి శక్తివంతమైన ది. కాబట్టే దసరారోజు తప్పనిసరిగా జమ్మి చెట్టును పూజించాలి. దసరా ముందు రోజు సీమోల్లంఘనం పేరిట గ్రామ పొలిమేరల్లోకి వెళ్లి అక్కడ ఉన్న జమ్మిచెట్టు ను ఆరాధిస్తారు. జమ్మి ఆకులను సేకరిస్తూ శమీశమీయతే పాపం శమీ శత్రు వినాశనీ అర్జునస్య ధరుర్ధారీ రామస్య ప్రియదర్శినీం అనే శ్లోకాన్ని పఠిస్తారు. పాండవులు అఙ్ఞాతవాసంలో వారి ఆయుధాలు ను ఉంచినది ఈ చెట్టు పైనే. శమీవ్రుక్చం రాముని చేతూ పూజలందుకుంది. ఆధునిక విజ్ఞానం కూడా జమ్మిచెట్టు లో ఎన్నో ప్రత్యేకతలు ను గుర్తించింది. జమ్మిచెట్టు పై పిడుగు పడదని, పిడుగులను త్రిప్పికొట్టే సామర్థ్యం ఉందని ఆధునికులు తేల్చారు. తెలంగాణ లో జమ్మి, ఆరె ఆకుల ను పెద్దలకు సమర్పించి, నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవడం ఆచారం. ఆంధ్రప్రదేశ్ లో జమ్మిపూజకు అత్యంత ప్రాధాన్యం ఉంది.

కామెంట్‌లు లేవు: