10, అక్టోబర్ 2020, శనివారం

ధార్మికగీత - 45*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                   *

                             ***** * *శ్లో:- పరోపకారాయ ఫలంతి వృక్షా:౹*

             *పరోపకారాయ వహంతి నద్యః ౹*

             *పరోపకారాయ దుహంతి గావః ౹*

             *పరోపకారార్థ మిదం శరీరమ్ ౹౹*

                          *****

*భా:- పరుల ఉపయోగానికి తరువులు తమ ఋతుధర్మాని కనుగుణంగా కాయలు, పండ్లు కాస్తూ, ప్రాణికోటికి జీవనాధార మౌతున్నాయి. నదులు, నదములు నిరంతరం సుదూర ప్రాంతాలకు ప్రవహిస్తూ సాగునీటిని, త్రాగునీటిని సరఫరా చేస్తున్నాయి. గోవులు పాలను స్రవించి, ఆబాలగోపాలానికి సమీకృత పోషకాహారంగా ఇస్తున్నాయి. పైన తెలిపిన చెట్లు, నదులు, ఆవులు వాక్కు, విచక్షణ లేనివి. అయినా పరోపకారంలో నాటికీ, నేటికీ మిన్నగా పేరు పొందుతున్నాయి. ఇక విద్య, , వైదుష్యము, విజ్ఞానము, విచక్షణ, వాగ్ఝరి లో ఆరితేరిన మానవుడు తన శరీరాన్ని పూర్తిగా పరోపకారం కోసమే వినియోగించాలి అనేదే శాస్త్రీయము. శిబి, రంతిదేవ,కర్ణ వంటి రాజులు ; డొక్కాసీతమ్మ, థెరీసా, నైటింగేల్ వంటి నారులు, మరెందరో పరోపకారంలో పునీతు లైనారు. చరిత్రలో వినీతు లైనారు. "అపకారికి కూడ ఉపకారం చేసినవాడే నేర్పరి" అన్నది సుమతీ శతకం. చెట్టు తనని గొడ్డలితో నరకడానికి వచ్చిన వాడికి కూడ చల్లని నీడ నిస్తోంది గదా! "శరీర మాద్యం ఖలు ధర్మసాధనం"అన్నారు పెద్దలు. శరీరం ఎలాగూ శుష్కించి, కృశించి, నశించేదే కనుక జవసత్త్వా లున్ననాడే పరోపకారకార్యాలు చేసి, నరజన్మను సార్థకం, సాఫల్యం చేసుకోవాలని సారాంశము*. 

                               *****

                  *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: