10, అక్టోబర్ 2020, శనివారం

ఎరుక

ఎరుక 

ఎరుక అంటే ఏమిటి అంటే తెలుసుకోవటం. తెలుసుకోవటమా ఏమి తెలుసుకోవటం అదే నిన్నటిదాకా నీకు యేదైతే తెలియలేదు అది తెలుసుకోవటం. అంటే నిన్నటిదాకా నీవు నీశరీరమే నీవు అని అనుకున్నావు కానీ ఈ రోజే నీవు ఒక కొత్త విషయాన్నీ తెలుసుకుంటున్నావు అది ఏమిటంటే నీవు నీశరీరానివి కావు నీ శరీరానికన్నా బిన్నంగా ఇంకొకటిగా ఉన్నావని . అది యెట్లా అన్నది ఇప్పుడు తెలుసుకుందాము. 

నీవు నీ శరీరమే అనుకో అది ఎట్లావచ్చింది మీ తల్లిగారు నవమాసాలు మోసి (తయారుచేసి) ఈ భూమిమీదికి తీసుకొని వస్తే అది వచ్చింది. ఆ శరీరం ఒక మూర్ఖుని వాలే వున్నది. అటువంటి మూర్ఖుడు ఇక్కడి ప్రకృతిని చూసి రోజు ఒక కొత్తవిషయాన్ని తెలుసుకొని ఇప్పుడు ఇంత తెలివిమంతుడివిగా అయ్యావు. ఒక్క సారి చూడు నీ బాల్యంలో నీకు ఏమి తెలియదు ప్రతిదీ కాలగమనంలో నీవు తెల్సుకున్నదే. అన్ని తెలుసుకున్న నీవు ఇప్పుడు నీకు తెలియని విషయాలు తెలుసుకొనే స్థితిలో వున్నావు. నీకు మంచి ఏమిటో తెలుసు చెడు ఏమిటో తెలుసు. మంచి చెడులను గుర్తించే జ్ఞానం నీకు వుంది దానినే విచక్షణా జ్ఞ్యానం అంటారు. నీ ఈ విచక్షణ జ్ఞానంతో నీవు ఈ ప్రకృతిని (జగత్తుని) చూస్తున్నావు. 

నీకు నీ శరీరం కాకుండా శరీరంలోనే వుంటూ వున్నది ఇంకొకటి వున్నది. దానికి నీవు ఏపేరు ఐనా పెట్టు కానీ అది మాత్రం ఉన్నదన్నది సత్యం. దానిని నీకు అర్ధం కావటానికి నేను చెతన్యం అని అంటున్నాను ఎందుకంటె నీ శరీరం అనే జడాన్ని ఉత్తేజపరిచేది అది కాబట్టి దానిని చెతన్యం అందాము. మరి ఆ చెతన్యం నీకు మాత్రమే ఉందా లేక ఇతరులకు కూడా వుందా అన్నది నీ ప్రశ్న.  ఆచేతన్యం నీకే కాదు నీవు జీవులు అనుకునే అన్ని జీవరాసులల్లోను వున్నది అందుకే అవి జీవన వ్యాపారాలు చేస్తువున్నాయ్. 

నీవు నీ కాలు కదిలించాలని అనుకున్నావు వెంటనే నీ కాలు కదులుతుంది. నీవు నిలుచోవాలి అనుకుంటావు వెంటనే నీవు నిలబడతావు అలానే నీ భావాలను ఇతరులకు చెప్పాలని అనుకుంటుటావు అలానే నీవు మాట్లాడుతావు. ఇవ్వన్నీ నీ శరీరంతో చేయించేదే ఆ చతన్యం. 

నీవు నీ ఎదురుగా వున్నా వాని చేయి కదలాలి అని అనుకుంటావు కానీ అతని చేయి కదలదు ఎందుకంటె నీలోవున్న చెతన్యం కేవలం నీ శరీరాన్ని మాత్రమే నియంత్రించ గలదు కానీ నీ ఎదురు వాని శరీరాన్ని నియంత్రించలేదు. దీనిని బట్టి నీకు ఏమితెలుస్తున్నది అంటే నీలో వున్న చెతన్యము కన్నా బిన్నంగా నీ ఎదురు వానిలో వున్న చెతన్యం వున్నది ఇద్దరిలో కూడా వున్నది చెతన్యమే అయినా అది ఒకదానికన్నా ఇంకోటి భిన్నంగా వుంది. ఆ చేతన్యాన్నే ఆత్మా అని మన మహర్షులు మనకు ప్రభోదించారు

ఇలా నీవు నీ శరీరము కాదు దానికన్నా బిన్నంగా వున్న చేతన్యాన్ని అని తెలుసుకునే జ్ఞానమే ఆత్మకు సంబందించిన జ్ఞానం దానినే ఆత్మ జ్ఞానం అంటారు. నేను శరీరాన్ని కాదు దానిని నడిపించే ఆత్మను అనే జ్ఞానాన్ని కలిగి ఉండటమే ఎరుక అంటే. 

ఆత్మా జ్ఞానాన్ని ఎందుకు పొందాలి ముందు ముందు తెలుసుకుందాము. 


 

కామెంట్‌లు లేవు: