10, అక్టోబర్ 2020, శనివారం

శ్రీ అన్నపూర్ణాష్టకం

 *శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ అన్నపూర్ణాష్టకం*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*శ్రీ అన్నపూర్ణ దేవి అష్టకం*


*1)నిత్యానందకరీ వరాభయకరీ సౌన్దర్యరత్నాకరీ|*


*నిర్ధూతాఖిలఘొరపాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరీ|*


*ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ|*


*భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||*


*నిత్యమైన ఆనందము నిచ్చుదానవు, వరములను- అభయమును ప్రసాదించు దానవు, సౌందర్య సముద్రమైన దానవు, ఘోరమైన పాపముల నన్నిటినీ కడిగి వేయుదానవు, హిమవంతుని వంశమును పవిత్రము చేసిన దానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్షపెట్టుము తల్లీ.*




*2) నానారత్న విచిత్రభూషణకరీ హేమామ్బరాడమ్బరీ|*


*ముక్తాహారవిడమ్బమానవిలసద్వక్షొజకుమ్భాన్తరీ|*


*కాశ్మీరాగరువాసితాఙ్గరుచిరా కాశీపురాధీశ్వరీ|*


*భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||*


*వివిధ రత్నముల విచిత్రాభరణములను ధరించినదానవు, బంగారు వస్త్రములను కట్టుకున్న దానవు, వక్షస్థలముపై ప్రకాశించు ముత్యాల హారములు ధరించిన దానవు, కుంకుమ- అగురులు పూసుకొనుటచే సువాసనలు వేదజల్లు శరీరము కలదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్షపెట్టుము.*




*3)యోగానన్దకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ|*


*చన్ద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ|*


*సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ|*


*భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||*


*యోగముచే పొందు ఆనందమును కలిగించుదానవు, శత్రువులను నాశనం చేయు దానవు, ధర్మనిష్టను ఏర్పరచుదానవు, చంద్రుడు- సూర్యుడు- అగ్నులతొ సమానమైన కాంతి ప్రవాహమైనదానవు, మూడులొకములను రక్షించుదానవు, సమస్త్యైశ్వర్యములను ప్రసాదించు దానవు, తపస్సులకు ఫలము నిచ్చుదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్షపెట్టుము తల్లీ.*




*4)కైలాసాచలకన్దరాలయకరీ గౌరీ హ్యుమా శాఙ్కరీ|*


*కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యొంకారబీజాక్షరీ|*


*మోక్ష ద్వారా కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ|*


*భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||*


*కైలాస పర్వత గుహయందుడు దానవు, తెల్లని దానవు, ఉమాదేవివి, శంకరుని భార్యవు, కుమారివి, వేదార్థమును బోధించు దానవు, ఓంకార బీజాక్షరస్వరూపము కలదానవు, మోక్షద్వారపు తలుపులను తెరచెడి దానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివీ, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము తల్లీ.*




*5)దృశ్యాదృశ్య విభూతివాహనకరీ బ్రహ్మాణ్డభాణ్డొదరీ|*


*లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞాన దీపాఙ్కురీ|*


*శ్రీవిశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ|*


*భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ|||*


*కనబడీ కనబడని మహిమలు కలదానవు, గర్బము నందు బ్రహ్మాండములను మోయుచున్న దానవు, లీలా నాటకమునకు సూత్రధారివి, విజ్ఞానదీపమును వెలిగించుదానవు, పరమేశ్వరుని ఆనందింపచేయుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి , అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము తల్లీ.*




*6) ఆదిక్షాన్త సమస్తవర్ణనికరీ శంభుప్రియా శాంకరీ|*


*కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ|*


*స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాదీశ్వరీ|*


*భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||*


*’అ’ కారము మొదలు ’క్ష’ కారము వరకు ఉన్న అక్షరముల సముదాయమైన దానవు, పరమేశ్వరునకు ప్రియురాలవు, శంకరుని భార్యవు, కాశ్మీర త్రిపురేశ్వరివి, మూడుకన్నులు కలదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము తల్లీ.*




*7)ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ|*


*నారీనీలసమానకున్తలధరీ నిత్యాన్నదానేశ్వరీ||*


*సాక్షాన్మోక్షకరి సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ|*


*భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||*


*భూమియందలి సమస్తజనులకు నాయకురాలవు, విజయమునిచ్చుదానవు, తల్లివి, దయాసముద్రమైనదానవు, స్త్రీమూర్తివి, నల్లని కురులు కలదానవు, నిత్యము అన్నదానము చేయుదానవు, సాక్షాత్తుగా మోక్షము నిచ్చుదానవు, ఏల్లప్పుడు శుభము కలిగించు దానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము తల్లీ.*




*8)దేవీ సర్వ విచిత్ర రత్నరుచిరా దాక్షాయణీ సుందరీ|*


*వామా స్వాదుపయో ధరా ప్రియకరీ సౌభాగ్య మాహేశ్వరీ |*


*భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ|*


*భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||*


*దేవివి, విచిత్రములైన సర్వరత్నములతో అలంకరింపబడిన దానవు, దక్షుని కుమార్తెవు, సుందరివి, యువతివి, మధురమైన పాలిండ్లు కల దానవు, ప్రియము నిచ్చుదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము తల్లీ.*




*9)చన్ద్రార్కానలకో టికోటిసదృశీ చన్ద్రాంశుబిమ్బాధరీ|*


*చన్ద్రార్కాగ్నిసమానకుణ్డలధరీ చన్ద్రార్కవర్ణేశ్వరీ|*


*మాలాపుస్తకపాశసాఙ్కుశకరీ కాశీపురాధీశ్వరీ|*


*భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతా

కామెంట్‌లు లేవు: