రాఘవయ్య ఒంటరివాడు. సైకిల్ పై వెళ్ళి, చుట్టుప్రక్కల గ్రామాలలో నాటు వైద్యంచేస్తూ వారిచ్చిన వరకు తీసుకుని జీవనం సాగించేవాడు.
ఓరోజు అర్థరాత్రి వేళ బైటవున్న సైకిల్ ను ఓ దొంగ తీసుకోబోతున్నాడు.అది ప్రక్కింటి రాజు భార్య రేఖ చూసింది." ఏవండీ! పాపం ముసలాయన సైకిల్ ఎవడో దొంగ తీసుకుపోతున్నాడు. పోయి పట్టుకోండి"
"భలే!సంఘసేవకు రాలివి దొరికావు కదమ్మా! వాడు నాలుగు పీకితే బాగా గాలికొడితే ఎక్కడ పడతాడో తెలియని ఈముసలాయన మనల్నికాపాడుతాడా? ఎవరెలా పోతే మనకెందుకు మనం బాగుండామా లేదా అనేది చూసుకోవాలి నోరుమూసుకుని పడుకో"
తెల్లవారి చూసుకుంటే సైకిల్ లేకపోవడంతో గుండె చెరువైపోయింది. కొనే శక్తిలేక నడచిపోయి వైద్యం చేయసాగాడు.
కాలచక్రం తిరిగిపోతున్నది
ఓరోజు రాజు వ్యాపారానికి పోయాడు. భార్య అంగడికి పోయింది. పిల్లవాడు దూగాడుతూ వచ్చి నేల బావిలోపడిపోయాడు.దబామని శబ్దంరావడంతో ముసలాయన వచ్చి చూశాడు ఇంకేముంది బిడ్డ..... అమాంతం బావిలోకి దూకి పిల్లవాడిని బయటకుతీసి ప్రథమ చికిత్సచేశాడు.
అంతలో వాళ్ళమ్మ వచ్చింది
. జరిగింది తెలుసుకుని గుండెలు బాదుకుంది
భర్త రాగానే జరిగింది చెప్పి ఏడ్చింది
"ఆనాడు సైకిల్ దొంగ ఎత్తుకుపోతుంటే మనకెందుకని ఊరకున్నాను. నీవూ అలా అనుకుని వుంటే మా వంశాకురమైన నా కొడుకు ఏమయ్యేవాడు
ప్రతి ఒక్కరూ మనకెందుకు మనకెందుకు అని ఊరుకోబట్టే ఏ సమస్యా పరిష్కారం కావటంలేదు.
నా బిడ్డను బ్రతికించి మమ్ము పుత్రశోకం నుండి కాపాడావు " అంటూ కాళ్ళపైబడి క్షమించమని వేడుకున్నాడు
మరునాడు ముసలాయనకు క్రొత్త సైకిల్ కొనిచ్చాడు రాజు
రై మని నాలుగూళ్ళు తిరిగి ఎక్కువ మందికి సేవచేయ గలిగాడు ముసలాయన.
✍🏻జంజం కోదండ రామయ్య
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి