10, అక్టోబర్ 2020, శనివారం

అష్ట లక్ష్మీప్రదం

 💐💐💐 *శుక్రవారం – అష్ట లక్ష్మీప్రదం* 💐💐💐


హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదల దేవత. వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీ దేవియే అష్ట లక్ష్మిలుగా పూజింపబడుతుంది. దేవాలయాలలో అష్ట లక్ష్మిలు ఒకే చోట అర్చింపబడడం సంప్రదాయం.


 *ఈ అష్ట లక్ష్మిలు:-*💐


🚩 *ఆదిలక్ష్మి :-*

"మహాలక్ష్మి" అనికూడా అంటారు. నాలుగు హస్తాలతో, ఒక చేత పద్మం, మరొక చేత పతాకం ధరించి, రెండు చేతులందు అభయ వరద ముద్రలు కలిగి ఉంటుంది.


🚩 *ధాన్యలక్ష్మి :-*

ఎనిమిది చేతులతో, పచ్చని వస్త్రాలతో ఉంటుంది. రెండు చేతులలో పద్మాలు, ఒక చేత గద, మూడు చేతులలో వరి కంకి, చెరకు గడ, అరటి గెల కలిగి రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది.


🚩 *ధైర్యలక్ష్మి :-*

"వీరలక్ష్మి" అని కూడా అంటారు. ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించినది. చక్రము, శంఖము, ధనుర్బాణములు, త్రిశూలము, పుస్తకము ధరించినది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో నుండును.


🚩 *గజలక్ష్మి :-*

రాజ్య ప్రదాత. నాలుగు హస్తములు కలిగిన మూర్తి. ఇరువైపులా రెండు గజాలు అభిషేకం ఛేస్తుంటాయి. ఎర్రని వస్త్రములు ధరించినది. రెండు చేతులలో రెండు పద్మములు కలిగినది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో ఉంటాయి.


🚩 *సంతానలక్ష్మి :-*

ఆరు చేతులు కలిగినది. రెండు కలశములు, ఖడ్గము, డాలు ధరించినది. వడిలో బిడ్డ కలిగియున్నది. ఒకచేత అభయముద్ర కలిగినది. మరొక చేయి బిడ్డను పట్టుకొనియున్నది. బిడ్డ చేతిలో పద్మము ఉన్నది.


🚩 *విజయలక్ష్మి :-*

ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించినది. శంఖము, చక్రము, ఖడ్గము, డాలు, పాశము ధరించినది. రెండు చేతుల వరదాభయ ముద్రలు కలిగినది.


🚩 *విద్యాలక్ష్మి :-*

శారదా దేవి. చదువులతల్లి. చేతి యందు వీణ వుంటుంది.


🚩 *ధనలక్ష్మి :-*

ఆరు హస్తాలు కలిగిన మూర్తి. ఎర్రని వస్త్రాలు ధరించినది. శంఖ చక్రాలు, కలశము, ధనుర్బాణాలు, పద్మము ధరించిన మూర్తి. అభయ ముద్రలోనున్న చేతినుండి బంగారునాణేలు వర్షిస్తున్నట్లు చిత్రింపబడుతుంది.

కొన్ని చోట్ల ఐశ్వర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, వరలక్ష్మి అనే పేర్లు ఉంటాయి.


 *ప్రార్ధన:*💐

అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి

విష్ణు వక్షఃస్థలారూఢే భక్తమోక్ష ప్రదాయిని

శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే

జగన్మాత్రేచ మోహిన్యై మంగళం శుభమంగళం

కామెంట్‌లు లేవు: