శివపాద సంస్పర్శ సేయంగ సితమేఘ
బృందాల తలయెత్తె హిమనగంబు
శివదేవు తాండవశ్రీ వీక్షకై పత్ర
సుమనేత్రముల పొల్చె హిమనగంబు
శివదేవు కృపగోరి శిఖిలోక రమణీయ
నృత్యాల సాగించె హిమనగంబు
శివుని కైలాసమున్ శిరముపైదాల్చిన
మమతచే నుప్పొంగె హిమనగంబు
శివ శివాహ్లాద సంచార సిద్ధిచేత
స్వచ్ఛ శృంగారసాధనా స్థావరమయి
క్ష్మా ధరాధిప సత్కీర్తి చంద్రికలను
విమల సచ్చిదానందయ్యె హిమనగంబు.
రాయప్రోలు సీతారామశర్మ, భీమవరం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి