10, అక్టోబర్ 2020, శనివారం

**అద్వైత వేదాంత పరిచయము**


2.5 ఇతిహాసాలు :`

  ఇవి చరిత్రని ఆధారంగా చేసుకుని రచింపబడిన గ్రంధాలు. నిజంగా జరిగిన విషయం ఉంటుంది. ఇతి అంటే ఇలా, ఈ విధంగా, హ ఖచ్చితంగా, ఆస ఇది జరిగింది, 

అంటే ఈ విధంగా, ఖచ్చితంగా ఇది జరిగింది. పురాణాల్లో కూడా నిజంగా జరిగిన అంశాలుంటాయి. రెండు ముఖ్యమైన ఇతిహాసాలు-రామాయణం(24000 శ్లోకాలు), మహాభారతం (లక్ష 

శ్లోకాలు),రామాయణాన్ని వాల్మీకి, మహాభారతాన్ని వ్యాసాచార్యుడు రచించారు.

  రామాయణం రాముని జీవన విధానాన్ని వర్ణిస్తుంది. రామస్య అయనం ` మార్గ: జీవనరీతి:మహాభారతం భరత వంశ రాజుల చరిత్ర. మహా అంటే పెద్ద. ఇది చాలా పెద్దది. 

ఆదర్శప్రాయులని అనుసరించాలని చూస్తారు ప్రజలు. అందుకని వాళ్ళ కథలు. 

  చరిత్ర గురించి చెప్తుంది కాని, చారిత్రాత్మక విశేషాలకి పెద్దపీట వేయదు. ఇక్కడ చరిత్రనిఆధారంగా తీసుకుని, వేదంలో ఉన్న జ్ఞానాన్ని బోధిస్తాయి. అందుకని వీటిలో కొంత 

నిజం, కొంత కల్పనా ఉంటుంది. ఉదాహరణకి రావణునికి నిజంగా పది తలలు ఉన్నాయా? అవి మనిషి

లో ఉండే రాక్షస గుణాలకి ప్రతీకలు. అందువల్ల కొంత అభూత కల్పన ఉంటుంది. కొన్ని లక్షణాలకి ఒక రూపం యివ్వటం జరుగుతుంది.


అద్వైత వేదాంత పరిచయం

2.6 భాష్యం :

  పైన ఉదహరించిన అన్ని గ్రంధాలకీ ఇచ్చిన వ్యాఖ్యానాలని భాష్యం అంటారు. వేదాలు, సూత్రాలు,ఇతిహాసాలకి ఇచ్చిన వాఖ్యానాలకి భాష్యాలు,ఆ భాష్యాలకి భాష్యాలు 

కూడా ఉన్నాయి.

  మనం శాస్త్రంని ఒక పద్ధతిలో నేర్చుకోవాలి. శాస్త్రం బోధించింది సరిగ్గా అర్థం కాకపోతే,శాస్త్రం మీద ప్రతికూల భావన పెంచుకోవటమో, దాన్ని ద్వేషించటమో చేసే ప్రమాదం 

ఉంది. అందుకని శాస్త్రాన్ని నేర్చుకోవటానికి ఒక తాళం చెవి ఉంది. దాన్ని సాంప్రదాయం అంటారు.

అందుకే సాధారణంగా అనువాదాల జోలికి పోవద్దంటారు. ఒక పదానికి రెండు, మూడు అర్థాలుంటాయి. సందర్భాన్ని బట్టి అది మారుతుంది. అందుకే గురుముఖత: నేర్చుకోవాలి. అంటే 

సాంప్రదాయం పాటించాలి. ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ, మన ఆచార్యులు భాష్య గ్రంధాలు, వ్యాఖ్యాన గ్రంధాలు రచించారు. ఇవి పద్యరూపంలోగానీ, గద్యరూపంలో గానీ 

ఉంటాయి. ఇవన్నీ కలిపి శాస్త్రం అంటాము. శాస్త్రం ఉద్దేశం మనం పురుషార్థాలని సాధించటానికి తోడ్పడటం.

అద్వైత వేదాంత పరిచయం

03. వర్ణాశ్రమ వ్యవస్థ

  మనిషికున్న లక్ష్యాలని ప్రేయస్‌గా, శ్రేయస్‌గా వేదం విభజించింది. ఆ లక్ష్యాలని సాధించటానికి, వేదాలు వర్ణాశ్రమ వ్యవస్థని సూచించాయి. అంటే వర్ణ వ్యవస్థ, ఆశ్రమ 

వ్యవస్థ.

  వర్ణ వ్యవస్థ సాంఘిక వ్యవస్థని సూచిస్తుంది. మనిషి సంఘజీవి, సంఘం మన జీవితాన్నిప్రభావితం చేస్తుంది. అందుకు మనకొక వ్యవస్థ ఉండాలి, జీవితం ప్రశాంతంగా 

సాగటానికి.

  అలాగే మనం వ్యక్తిగా మనకున్న సరదాలని పరిరక్షించుకోవాలి. మనం పూర్తిగా సంఘానికి అంకితమవలేము. మనం వ్యక్తిగా ఎదగాలి. దీన్ని ఆశ్రమ వ్యవస్థ అంటారు. ఈ 

రెండిరటినీ మనం సమతుల్యం చేయగలిగితేనే మన జీవితం సాఫీగా సాగుతుంది. వేదం ఈ రెండిరటినీ చక్కగా పాటించగలిగేందుకు అనువుగా వర్ణాశ్రమ వ్యవస్థని ఏర్పరచింది.

3.1 వర్ణవ్యవస్థ :` వర్ణం అంటే సంఘంలో ఒక ప్రత్యేక సముదాయం లేదా తెగ. మనకి నాలుగు వర్ణాలున్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ విభజన మూడు కోణాల నుంచి 

చేయబడిరది. జాతి, గుణం, కర్మ.

3.1.1 జాతి వ్యవస్థ : ఏ కులంలో పుడితే ఆ కులానికి చెందటాన్ని జాతి వ్యవస్థ అంటారు. జాతి అంటే జన్మ. దీన్ని బట్టి జాతి బ్రాహ్మణుడు, జాతి క్షత్రియుడు, జాతి వైశ్యుడు, జాతి` 

శూద్రుడు ఉన్నారు.

3.1.2 గుణ వ్యవస్థ :` స్వభావం లేదా గుణాన్ని బట్టి, విభజనలు చేయవచ్చు. దీన్ని గుణ వ్యవస్థ అంటారు. ఇందులో కూడా నాలుగు గుణాలని పేర్కొనవచ్చు. ఆధ్యాత్మిక చింతన ఉంటే, 

వాళ్ళు జాతి బ్రాహ్మణులు కాకపోయినా, వాళ్లని గుణ బ్రాహ్మణులు అనవచ్చు. వేదాంత పరిభాషలో వాళ్ళకి సత్వగుణం ఎక్కువగా, రజో గుణం కొంచెం తక్కువగా, తమోగుణం యింకా 

తక్కువగా ఉంటుంది (సరత).

  కొంతమంది పూజలు, పునస్కారాలు చేయకపోవచ్చు కాని నిస్వార్థంగా సంఘసేవ చేస్తారు. కుటుంబాన్ని పట్టించుకోవటానికి క్షణం తీరికలేనంత హడావిడిగా ఉంటారు. 

దీన్ని క్షత్రియ గుణం అంటారు. ఈ గుణం ఉన్నవాళ్లని గుణ క్షత్రియులంటారు. పుట్టుక ఏదైనా వీళ్ళకి రజోగుణం ఎక్కువగానూ, సత్వగుణం, తమోగుణం తక్కువగానూ ఉంటాయి (రసత).

  వీళ్ళు కూడా కుటుంబాన్ని పట్టించుకునే తీరిక లేనంత హడావిడిగానే ఉంటారు కానీ, వీళ్ళ పనులన్నీ స్వార్థపూరితంగా ఉంటాయి.పేరు, ప్రతిష్టల కోసం పాటుపడ్డా, 

ముఖ్యంగా తమకీ, తమ కుటుంబానికీ డబ్బు సంపాదించుకోవటమే ధ్యేయంగా ఉంటారు. ఈ గుణాన్ని వైశ్యగుణం అనీ యిది ఉన్నవాళ్లని గుణవైశ్యులనీ అంటారు. పుట్టుక ఏదైనా, వీళ్ళకి 

రజోగుణం ఎక్కువగానూ, తమోగుణం, సత్వగుణం తక్కువగానూ 

ఉంటాయి (రతస).

  నాలుగోరకం వాళ్ళు మందకొడిగా ఉంటారు. తినటం,పడుకోవటం తప్ప ఏమీ చేయరు.వాళ్ళకి అనుభవించటానికి ఆస్తి ఉండవచ్చు. అందుకని కూడా వాళ్ళలో తపన 

ఉండదు. ఏదో యాంత్రికంగా చేసుకుపోయే పనులు చేయగలరు. అంతే. అలాంటి గుణాన్ని శూద్రగుణమనీ, అలాంటి వ్యక్తులని గుణశూద్రులనీ అంటారు. పుట్టుక ఏదైనా, వీళ్ళకి


తమోగుణం ఎక్కువగానూ, రజోగుణం, సత్వగుణం తక్కువగానూ ఉంటాయి 

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: