10, అక్టోబర్ 2020, శనివారం

🔱సర్వం శక్తిమయం🔱


ఈ లోకంలోని సకల జీవరాశులను రక్షించి, నడిపించే శక్తి ఆది పరాశక్తి. ఈ అతీత శక్తి రెండు విధాలు.

ఒకటి కంటికి కనబడేది.

మరోకటి అగోచరంగా మనలను నడిపించేది.


మన దేహం కంటికి కనిపించేది..దేహంలోని ప్రాణం కంటికి కనపడని

శక్తి. రోజూ మనం ఉపయోగించే ఫాన్ మన కంటికి కనిపించే వస్తువైతే దానికి

తిరిగే శక్తిని యిచ్చేది విద్యుత్ఛక్తి . అది కంటికి తెలియని శక్తిగా ఫాన్ పనిచేయడానికి దోహదపడుతుంది.


ఫ్యాన్, ఫ్రిజ్ , కరెంట్ దీపాలు , యంత్రాలు అని మనం వుపయోగించే అనేక వస్తువుల ఆకారాలు ఒకేలా వుండవు. ఒక్కొక్కటి ఒక్కొక్క రూపంలో వుంటుంది. 

తన రూపానికి తగిన పనులు చేస్తాయి. కాని

వాటిని పని చేయించే 

విద్యుత్ ఒకే రూపంలో వుంటుంది. 

ఆవిధంగానే రూపంలో కాకి, గాడిద, పాము, మనిషి, సింహం, ఏనుగు అంటూ వివిధ రూపాలలో 

జీవం వున్నా 

అన్నిటిలోని చైతన్య శక్తి వ్యత్యాసం లేకుండా ప్రాణశక్తిగా ఒకేలా ప్రవహిస్తున్నది.


మనకి రూపాన్నిచ్చిన తల్లిగా రూపానికి చైతన్యం తో నడిపించే ప్రాణశక్తి ఆది పరాశక్తి అని తిరుమూలర్

అనే మహానీయుడు చెపుతున్నారు.


జగన్మాత అయిన పరాశక్తి అనుగ్రహం లేకుండా ఏ శక్తి పని చేయలేదు. అటువంటి ఆదిపరాశక్తి నవ పరాశక్తులుగా ఈ ముల్లోకాలలో వెలుగొందుతున్నది.

 త్రిపుర,సుందరి, అంతరి, సింధూరి, పరిపూర్ణ, నారణి, పలవన్నత్తి, ఈశ్వరి, మనోన్మణి, అని నవ శక్తి రూపాలతో జగాన్నంతటిని పరిపాలిస్తున్నది 

ఆదిశక్తి స్వరూపిణి. 


సూర్య,చంద్రులు, అగ్ని ఈ మూడూ

" త్రిపుర" గా పిలుబడుతున్నవి.


ఒక్కొక్క రూపము కలిగివుండే అందమైన స్ధితి " సుందరి".


ఆకాశంలోని 

ఇంద్రధనస్సు అనేక వర్ణాలతో కాంతులీనుతూ గోచరించే

స్వరూపమే " అంతరి".


జీవుల దేహంలో ఎఱ్ఱని రుధిరంగా ప్రవహించి కాపాడే రూపమే 

" సింధూరి".


కరుణ , ప్రేమ, పాశం, దయ మూర్తీభవించిన ఆ మాతృమూర్తి

స్వరూపమే "పరిపూర్ణ".


అధర్మాన్ని ఎదిరించి సమూలంగా నాశనం నాశనం చేసే స్వరూపమే

దుర్గ అయిన " నారణి".


కొంత కాలం ఎఱుపు వర్ణంతోను, కొంత కాలం 

పసుపు వర్ణంతోను, కొంత కాలం గోధుమ వర్ణంతోను, కొంత కాలం నల్లని వర్ణంతోను,దర్శనమిచ్చే

రూపమే " పలవణ్ణత్తి"


ఈ విధంగా సర్వకాల సర్వావస్ధలయందు, అంతరంగాలలో నివసించే

దేవి ఆది పరాశక్తి. 


అహంకారం, అజ్ఞానం మాయ, అనే 

 మాయాశక్తి స్వరూపమే

త్రిపుర సుందరి. పైన చెప్పిన మూడు దుర్గుణాలను దహించి

జయించిన వాడు  

ఆది శంకరుడు. ఎవరైతే త్రిపురాన్ని దహిస్తాడో వారే ఆదిశివుని అంశ అవుతున్నారు. అట్టి పరమేశ్వరునికి మాత అణిగి వుంటున్నది. 


అహంకారం రంగు ఎఱుపు ,మేధస్సు వర్ణం తెలుపు, మాయ వర్ణం నలుపు. 


అహంకారం పసిడి సంకెల, మేధస్సు వెండి సంకెల, మాయ ఇనుప సంకెల.


అహంకారానికి అధికారిణి అయిన లక్ష్మి దేవి పసిడి ఛాయ.  


జ్ఞానానికి , మేధ కి అధిదేవత అయిన సరస్వతి శ్వేత వర్ణం. 


మాయకి అధికారిణి పార్వతీదేవి నలుపు వర్ణం.


సంపద, విద్య , వీరం అనే మూడు సంపదలని

మనకి అనుగ్రహించి, అవి మన కళ్ళకి తెలియని విధంగా , అహంకారం, అవిద్య , మాయ అనే బేడీలు వేసి మనలని ఆడించే ఆది పరాశక్తిదేవిని శాంభవి,ఆంకారి, హ్రీంకారి, అని అంటారు .

ఈ మూడు సంకెలల నుండి విముక్తి పొందిన వీర పురుషునికి దేవీ

సంపద, విద్య, వీరం అనే మూడు పుష్పాలను మాలగా వేసి ఉత్తమ పురుషునిగా చేస్తున్నది.

 ఆ ఉత్తమ పురుషునికి తాను దాసురాలవుతున్నది.


ఆది పరాశక్తి కి దాసులై అనుగ్రహం పొందిన వారికి ఇహలోక భోగాలను, పరలోక జ్ఞానమైన బ్రహ్మానందాన్ని

కటాక్షిస్తున్నది.  

శివశక్తి గా

ఆది పరాశక్తి అనుగ్రహం ప్రసాదిస్తున్

కామెంట్‌లు లేవు: