*మనిషిని పతనావస్థకు లోను చేసేది అహంకారం. దానిని జయించినవారే జీవితంలో రాణిస్తారు. దీనినో సాధించామని, సంపదలని పొగుచేసుకున్నామని, తిరుగులేని అధికారం తమ సొంతమని, అనంతమైన పేరు ప్రతిష్టలు సంపాదించామని, తమంతటివారు ఎవరు ఉండరని అహంతో వ్యవహరిస్తారు. ఇతరులని చులకనగా చూస్తూ, తమని తాము అధికులమనుకుంటారు. కానీ ఈ అహం వారికి యశోభుషణం ఎంత మాత్రం కాదు. అది గర్వకారణం కాదు. అతి అల్పమైనది. అందువల్లే అహాన్ని వదిలి వ్యవహరించాల్సిన అవసరాన్ని తథాగతుడు పదే పదే ప్రబోధించారు:*
*"అహంకారాన్ని జయించాలనే సిద్దాంతాన్ని ఎందుకు భోధిస్తున్నానంటే మనుష్యుల ఆత్మలను నాశనం చేయడం కోసం కాక వాటిని కాపాడడం కోసమే. అహంకారాన్ని జయించినవారు అహంకారానికి దాసుడైన వారికంటే జీవించడానికి మరింత అర్హత పొందుతారు, విజయాలను సాధిస్తారు, జీవితంలో జయప్రదామవుతారు. అహంకారం కల్పించే భ్రమలనుంచి బయట పడ్డ వాడు జీవిత సమరంలో పతనం చెందడు, దృడంగా నిలబడతాడు". అలాంటి మహితోక్తులు ఉత్తేజపురితంగా ఉంటాయి. అయితే వాటిని ఆచరణలో భాగం చేసుకున్న వారి హృదయాలే వెలుగును సంతరించుకుంటాయి. అలాంటి వారి మాట, చేత పదుగురికి స్ఫూర్తినిస్తాయి. తమని తాము అధికులుగా భావించుకున్న వారు ఎక్కడో చోట ఎప్పుడోసారి భంగపడతారు. ఒక చిన్న మాటతో వారి అహం కుప్పకూలి పోతుంది. తమ సంపదలు, అధికారం, పేరు ప్రతిష్టలు శాశ్వతం కావని తెలుసుకోలేని అజ్ఞానమే ఈ దుస్థితికి మూలం. మనసా, వాచా, కర్మణా శుద్ధముగా వ్యవరించే శైలి మాత్రమే మనుషుల్ని ఉన్నత స్థితికి తీసుకువెళుతుంది. పదుగురి మధ్య ఉదాత్తంగా నిలుపుతుంది.*
*సర్వేజనా సుఖినో భవంతు....మీ ఆకొండి రామ మూర్తి...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి