'నౌకాగ్ర కాకవత'
కాకులకు గల సహజ గుణం ఒకచోట వాలి కొంతసమయం ఉండి మరల లేచి ఇంకొక చోటికి వెళ్ళుతాయి. అంటే ఒకచోట స్థిరంగా వుండవు. అలాగే ఒక కాకి ఒక నౌకమీద అంటే నౌకమీద వుండే స్తంభం మీద వాలిందట కొంతసమయం అది అక్కడ వున్నది. కానీ కాకికి తెలియకుండా ఒక సంఘటన జరిగింది అదేమిటంటే ఆ నౌకని నడిపే నావికుడు అతివేగంగే నౌకను సముద్రంలోకి తీసుకొని వెళ్ళాడు. ఈ విషయం తెలియని కాకి తన స్వభావానుసారం నౌక స్తంభం మీదినుంచి లేచి ఇంకొక చోటికి వెళ్ళటానికి యెగిరి వెళ్ళింది. కానీ దానికి ఆ స్తంభం తప్పించి ఆ పరిసరాలలో ఎత్తయిన ప్రదేశం అంటే భవంతులు కానీ, చెట్లు కానీ ఏవి కనుచూపు మేరలో కనిపించలేదు. అంతే కాదు చుట్టూ లోతయిన సముద్రం. పొరపాటున సముద్రంలో పడితే అంతం తప్పదు. కొంచం సేపు గాలిలో యెగిరి మరలా ఆ నౌక స్తంభంమీదనే వాలింది. కొద్దిసేపయినా తరువాత తన సహజ స్వభావంతో మరల గాలిలో యెగిరి అంతటా తిరిగి చూసింది కానీ పరిస్థితి అట్లానే వున్నది. అలాగ మరలా మరలా తిరిగి తిరిగి చివరకు తెలుసుకున్నది తనకు ఆ నౌక స్తంభం తప్ప వేరే ఆధారం లేదని. కానీ ఈ విషయం తెలుసుకోవటానికి ఆ కాకి చాలాసార్లు ఆ నౌక స్తంభం మీది నుంచి లేచి గాలిలో ఎన్నో సార్లు తిరిగిన తరువాత కానీ తనకు ఆ నౌక స్తంభం తప్ప వేరే గతి లేదని తెలుసుకోగలిగింది. కాబట్టి
సాధక మన మనస్సు కూడా ఆ కాకి లాంటిదే ఎప్పుడు ఒక చోట నిలువదు ఒకచోటి నుండి ఇంకొక చోటికి అంటే ఒక విషయం మీదనుండి ఇంకొక విషయం మీదకు వెళుతూ ఉండటం దాని సహజ లక్షణం. ఆ లక్షణాన్ని వదిలి దానికి భగవంతుడు తప్ప ఇతర విషయాలు లేవనేవిధంగా సాధకుడు సద దైవ జ్యానంలో ఉండాలి ఎలాగంటే కాకికి ఒక్క నౌక స్తంభం తప్ప ఇంకొకటి కనపడనట్లు సాధకుని మనస్సుకు భగవంతుడు తప్ప ఇంకొక విషయం లేదు అనే విధంగా సాధకుడు ప్రవర్తిస్తే సాధకుని మనస్సు సదా భగవంతుని మీదనే ఉంటుంది. కాకపొతే ఇది చెప్పినంత సులువు కానే కాదు. అతి కఠోరమైన, నిరంతమైన కఠోర తప్పస్సు చేస్తేనే అది సాధ్యం. నేను ఆలా చేయగలనా అనే సందేహం ప్రతి సాధకునికి కలుగుతుంది. కానీ మిత్రమా నిత్య దీక్షాపరుడైన సాధకుడు తప్పకుండా సాధించగలడు. అరిషడ్వార్గాలను వదిలి ఇప్పుడే సాధన మొదలు పెట్టు తప్పకుండా నీ లక్ష్యం నెరవేరుతుంది. ఎందుకంటె సదా సర్వేశ్వరుడు సాధకునితోటె ఉంటాడు.
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి