29, మే 2022, ఆదివారం

భగవద్గీత

 


🌹భగవద్గీత🌹


పదునైదవ అధ్యాయము

పురుషోత్తమ యోగము

1వ శ్లోకo

 

శ్రీభగవానువాచ 


ఊర్థ్వమూలమధశ్శాఖమ్ 

అశ్వత్థం ప్రాహురవ్యయమ్ ౹

ఛందాంసి యస్య పర్ణాని 

యస్తం వేద స వేదవిత్ ౹౹ (1)


ఊర్థ్వమూలమ్ , అధఃశ్యాఖమ్ ,

అశ్వత్థమ్ , ప్రాహుః , అవ్యయమ్ ౹

ఛందాంసి , యస్య , పర్ణాని , 

యః , తమ్ , వేద , సః , వేదవిత్ ౹౹ (1)


ఊర్థ్వమూలమ్ = ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగాను

అధఃశ్శాఖమ్ = బ్రహ్మయే ముఖ్యశాఖగాను కలిగిన 

అశ్వత్థమ్ = సంసారరూపమైన అశ్వత్థవృక్షము (రావిచెట్టు) ను

అవ్యయమ్ = శాశ్వతమైనదానినిగా 

ప్రాహుః = పేర్కొందురు 

ఛందాంసి = వేదములు 

యస్య , వర్ణాని = దేనియొక్క ఆకులో 

తమ్ = అట్టి సంసారరూపవృక్ష తత్త్వమును 

యః = ఏ పురుషుడు 

వేద = (సమగ్రముగా) తెలిసికొనునో 

సః = అతడు

వేదవిత్ = వేదార్థములను బాగుగా ఎఱిగినవాడు 

                           

తాత్పర్యము :- శ్రీ భగవానుడు పలికెను. ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగను , బ్రహ్మయే ముఖ్యశాఖగా (కాండముగా) , వేదములే పర్ణములు (ఆకులు) గా గల ఈ సంసారరూప - అశ్వత్థ వృక్షము నాశరహితమైనది . ఈ సంసార వృక్షతత్త్వమును మూలసహితముగా తెలిసినవాడు నిజముగా వేదార్థములను ఎఱిగినవాడు . (1)

   

        

కామెంట్‌లు లేవు: