🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*ధార్మికగీత - 107*
*****
*శ్లో:- దుర్జనః పరిహర్తవ్యః ౹*
*విద్యయా లంకృతో౽పి సన్ ౹*
*మణినా భూషిత స్సర్ప: ౹*
*కి మసౌ న భయంకరః? ౹౹*
*****
*భా:- లోకంలో అసత్యానికి, దౌర్జన్యానికి ఉన్నంత ప్రచారము, ఆర్భాటము సత్యానికి , సౌజన్యానికి ఉండవు. కాని అసత్యం, దుర్జనత్వము కలకాలం నిలబడలేవు.ఎప్పటికైనా సత్యమే, సౌజన్యమే విజయం సాధిస్తాయి. దుర్జనుడు ఎంత ఉన్నత విద్యలు అభ్యసించినా, శాస్త్రాలు,పురాణాలు తిరగేసినా, నీతులు, సూక్తులు వల్లించినా, డాబు, దర్పం ప్రదర్శించినా అతడు ముమ్మాటికి విడిచిపెట్టదగిన వాడే! అతని చుట్టూ చేరిన పరివారం కూడ అలాంటిదే కదా! అతనితో స్నేహం మిక్కిలి ప్రమాదకరం. ఎలా! నాగరాజు ఉన్నాడు. పైగా పడగపై మణితో ప్రకాశిస్తున్నాడు. విలువగలిగిన మణి మనకు కావాలి. సర్పాన్ని చూస్తేనే భయం. సర్పభయంతో ఆ విలువైన మణిని ఎలా సాధించలేమో, అలాగే అవగుణాలు గల ఆ దుర్జనుని నుండి కూడ విద్యను సాధించ లేము. ఈ రెండూ కానిపనులే. కాన పామును నిర్దాక్షిణ్యంగా వదిలినట్లే, ఆ దుర్జనుని కూడ తత్ క్షణం విడిచిపెట్టాలి. ఎన్ని ఆకర్షణలు ఉన్నా చెడువైపు పరుగెత్తరాదని, హంగు- ఆర్భాటం లేకున్నా మంచివైపే నెమ్మదిగా పయనించాలని సారాంశము*.
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి