12, డిసెంబర్ 2020, శనివారం

చిట్టికథ

 ✍️....నేటి చిట్టికథ


ఒక చిన్న గ్రామంలో రాళ్లు కొట్టేవాడు ఒకడు ఉండేవాడు. రొజంతా కష్టపడి రాళ్ళని సమమైన ఆకారం వచ్చేటట్లు కొట్టి , ఖాతాదారులకి తగినట్టుగా తయారు చేస్తూ ఉండేవాడు. ఈ పని వల్ల తన రెండు చేతులూ గట్టిగానూ మరియు బట్టలు చాలా మురికిగా తయారయ్యేవి.


ఒక రోజు ఒక పెద్ద శిలని కొట్టి గంటలు కష్టపడి పని చేశాడు .చాలా ఎండగా ఉండటం వల్ల అలిసిపొయి, నీడపట్టున కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు.


ఆ పక్కగా ఒక రాజుగారు వెళ్లడం చూసాడు....

రాజుగారిలా జీవిస్తే ఎంత బాగుండేదో ?” అనుకున్నాడు..అలా అనుకో గానే ఒక వింత జరిగింది.


రాళ్లు కొట్టే వాడు అకశ్మాత్తుగా మంచి ఖరీదుగల దుస్తులు, ఆభరణాలు వేసుకుని ఉన్నాడు. తన చెతులు ఎంతో మృదువుగా అయిపొయాయి. చక్కగా పల్లకిలో కుర్చుని ఉన్నాడు.


ఇలా ముందుకి పల్లకిలో సాగుతూ , కొద్దిసేపటికి రాజుగా మారిన రాళ్ళు కొట్టే వాడు ఎండ తట్టుకోలేక , మంత్రిని కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఆగమన్నాడు. 


అలా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అతనితో మంత్రి ఇలా అన్నాడు’ ,”మహారాజా మీరు ఈ రోజు సూర్యాస్తమయం అయ్యే లోపల అంత:పురానికి చేరుకోక పోతే నన్ను ఉరి తీస్తా అన్నారు కదా ?”అని మనవి చెశాడు .


అప్పుడు మళ్ళీ తన మనుసులో ఇలా అనుకున్నాడు, ” రాజుగా నేను యేమైనా చేయగలను కాని ,నాకంటే సూర్యుడు ఇంకా శక్తిగల వాడు. రాజుగా కంటే సూర్యుడిగా ఉంటే బాగుండు కదా “అని ఇలా అతడు అనుకోగానే  సూర్యుడి గా మారిపొయాడు.


ఇలా ఈ యొక్క కొత్త శక్తి ని అతను అదుపు లో పెట్టలేక పోయాడు.విపరీత మైన ఎండ కాయడం వల్ల పొలాలు ఎండి పొయేవి. సూర్య కిరణాలు వల్ల నీరు ఆవిరిగా మారి, భూమిని, పెద్ద మబ్బుగా కప్పి వేసింది ఆ ఆవిరి.


అప్పుడు అతను ” ఔనూ !సూర్యుడి కంటే మబ్బు శక్తివంత మైనది కదా “అనుకున్నాడు.


వెంటనే మబ్బుగా మారపోయాడు. తన శక్తిని చూపించుకో వాలనే అహంకార భావం వలన ,విపరీతమైన వాన, తుఫాను కురిపించాడు. పొలాలు, ఇళ్ళు అన్నీ కొట్టుకు పోయాయి. 


కాని, తను ఇదివరుకు పని చెస్తున్న శిల మాత్రం కదల లెదు. ఎంత వర్షం కురిసినా కదల కుండా అలా ఉండిపొయింది.


అప్పుడు శిల ఎంత శక్తి వంతమైనది కదా మబ్బు కంటే అనుకున్నాడు. రాళ్లు కొట్టే వాడికే కదా , అటువంటి శక్తివంతమైన శిలని మంచిగా తయారు చేయగలిగే శక్తి ఉంటుంది “! అని అనుకున్నాడు.


T.me/namonarayana


 వెంటనే మళ్ళీ అతను రాళ్లు కొట్టే వాడిగా మారి పొయాడు.


ఎప్పటి లాగానే తన రెండు చెతులూ కఠినంగా అయిపొయాయి, బట్టలు మాసి పోయి రాళ్లు కొడుతూ సంతోషంగా ఉన్నాడు.



తన తప్పుని తెలుసుకుని తృప్తిగా తన వృత్తి ధర్మాన్ని ఆనందంగా నిర్వర్తించ సాగాడు. 



🍁🍁🍁🍁🍁


శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః


----  భగవద్గీత


 “గొప్పగా ఉందనుకునే ఇతరుల ధర్మం కంటే, గొప్పగా కనిపించకపోయినా తన ధర్మమే మంచిది. ఆ ధర్మం ఆచరిస్తూ చనిపోయినా మంచిదే. అంతే కానీ పరుల ధర్మం ఆచరించడం భయంకరమైనది”


🍁🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: