10, జనవరి 2023, మంగళవారం

శ్రీగోలింగేశ్వరస్వామి బిక్కవోలు

 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀స్థల పురాణము

🍀శ్రీగోలింగేశ్వరస్వామి వారి

🍀 దేవస్థానం, బిక్కవోలు,

🍀 ఆంధ్రప్రదేశ్.

🍀1100సంవత్సరాల‌ చరిత్ర

🍀 కలిగిన బిక్కవోలు, ఆంధ్రప్రదేశ్ లోని అతి ప్రాచీన క్షేత్రాలలో ఒకటి.గోదావరి తీరంలో ఉన్న బిక్కవోలు గొప్ప ఆధ్యాత్మిక చారిత్రక విశేషాలు కలిగి, తూర్పు చాళుక్యుల వైభవం తో నిర్మించబడిన అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందినది.

       ఈ క్షేత్రం మొదట చాళుక్య విక్రముని పేర విక్రమపురం గానూ, మూడవ విజయాదిత్యునిగా పిలువబడిన,గుణగవిజయాదిత్యుని కాలం క్రీ.శ.849-892లో

'బిరుదాంకినవోలు'గానూ పిలువబడి, కాలగమనంలో 'బిక్కవోలు'గానూ నామాంతరం చెందినది.నేటికి ఈ 'బిక్కవోలు'గ్రామంలో ఆరు దేవాలయాలు అలనాటి శిల్పకళా వైభవానికి సాక్షి భూతంగా నిలుస్తున్నాయి.

        ఈ ప్రాంతంలో శ్రీ వత్సవాయి సూర్యనారాయణ తిమ్మగజపతి మహారాజు గారి గోవులు దేవాలయాల శిధిలాల పైకి వెళ్ళి అక్కడ ఉన్న పుట్టలో పాలు విడిచేవి.ఆ విషయం పశువుల కాపరుల ద్వారా రాజు కి తెలిసి, అక్కడ ఉన్న మట్టిని త్రవ్వించగా ఆ ప్రదేశంలో మూడు శివాలయాలు బయట పడ్డాయి.ఒక ప్రదేశంలో సకుటుంబ సపరివారంగా దర్శనం ఇస్తున్న మూడు శివాలయాలు సముదాయాన్ని 'త్రిల్లింగ'క్షేత్రము గా పిలుస్తారు.గోవుపాదాలతో త్రొక్కబడుట చేత, గోవు పాలు తో అభిషేకం చేయబడుట చేత అప్పటి వరకు విజయేశ్వరునిగా శాశనాలలో పిలువబడిన స్వామి నేడు 'గోలింగేశ్వరుని'గా పిలవబడు తున్నారు.అదే ఆలయం లో దేవేరి శ్రీ పార్వతీ అమ్మవారు, శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దక్చిణముఖంగా, శ్రీవిజయ గణపతిస్వామి వారు, శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రేశ్వరస్వామి వారు, ఉత్తర ముఖంగా కొలువుతీరి ఉన్నారు.ఈ ఆలయం ఇరు ప్రక్కలా శ్రీ చంద్రశేఖర స్వామి వారు, శ్రీ రాజరాజేశ్వర స్వామి వార్ల ఆలయంలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి.

         శ్రీగోలింగేశ్వరస్వామి వారి ఆలయం లో శ్రీకుమాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు బ్రహ్మచారి గా కొలవబడు చున్నారు.స్వామివారికి కుడివైపు న సహజసిద్ధమైన పుట్ట ఉన్నది.శ్రీకుమారస్వొమి ఫళణి క్షేత్రము లో వలెనే దక్చిణముఖంగా ను, కొలువై ఉన్నందున శ్రీస్వామి వారి ని దర్శించి అభిషేకములు జరిపించినంతనే విశ్వాధిపతి అయిన స్వామి అనుగ్రహం వలన

సకల గ్రుహశాంతి జరిగి కోరిన కోర్కెలు నెరవేరడం ఇక్కడ విశేషం.ప్రత్యేకించి అంగారక క్షేత్రము గా పిలువబడే ఈ దేవాలయం లో రాహు, కేతు,కుజ గ్రహ శాంతి ని కోరి కోరి జరిపించే దోషనివారణ పూజ వలన అనేక మంది కి వివాహ సిద్ధి, సంతానం,నష్టద్రవ్యప్రాప్తి, శారీరక మానసిక ఈతి బాధలు నుండి పరిహారం లభిస్తుంది అని నమ్మకం.

       ప్రతీ సంవత్సరం మార్గశిర మాసం శుద్ధ షష్ఠి రోజు న శ్రీకుమారస్వామి వారి షష్టి మహోత్సవం లు అత్యంత వైభవంగా జరుపబడుతాయి.ఈ రోజున సంతానం లేని మహిళలు పుట్టపై ఉంచిన నాగుల చీర కట్టుకుని స్వామివారి వైపు శిరస్సు ఉంచి,సాష్టాంగంగానిద్రించడం వలన, సంతానవంతులు అవుతారని ప్రగాఢ నమ్మకం.షష్టి రోజున లక్చలాదిమంది భక్తులు వచ్చి స్వామి వారి ని దర్శించి, తీర్ధప్రసాదాలు స్వీకరించెదరు.శ్రీస్వామివారి ఆలయంలో ఉత్సవములు, పూజలు, కార్యక్రమములు, కళ్యాణోత్సవాలు,స్మార్తాగమము ప్రకారం జరుగును.

      ఈ క్షేత్రం లో స్వామివారు సర్పాక్రుతిలో ప్రతీరోజూ తిరుగుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం.స్వామివారి పుట్ట వద్ద రాత్రి సమయంలో ఉంచిన పాలు స్వామి వారు వచ్చి త్రాగుతారని ఆలయం అర్చకులు ద్వారా వినడం జరిగింది.ఇక్కడ ఉన్న పుట్ట మన్ను చెవులకు, కన్నులకు రాసుకోవడం వల్ల చెవికి, కళ్ళకు సంబంధించిన వ్యాధులు రావని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

 మంగళం మహత్ శ్రీశ్రీశ్రీ

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

కామెంట్‌లు లేవు: