పరమాచార్య వారి హాస్య చతురత....
ఒకసారి స్వామి వారి దర్శనానికి ఒక వృద్దుడు వచ్చాడు.
వృద్దుడు "స్వామి. నాకు మూడు రోజులుగా జ్వరం తగులుతున్నది. దాని వల్ల ఏ పని చేయలేక పోతున్నాను. తమరు దయతో నాకు ఈ బాధ నుండి విముక్తి ఇవ్వండి."
స్వామి నవ్వుతూ "సరిపోయింది. నాకూ మూడు రోజులుగా జ్వరం. ఎవరికీ చెప్పుకోలేక చూస్తున్నాను. అలా కూర్చోండి. మీకోసంగతి చెప్పాలి.ఒక ఊర్లో ఒక పూజారి ఉండేవాడు. అతనికి వాక్ శుద్ధి ఉన్నది. అతను జరగబోయేది ఖచ్చితంగా చెప్పేవాడు. అతనికి ఆ ఊరి పోలీస్ మంచి మిత్రుడు.
ఒకరోజు గుడి తలుపులు తీసేసరికి ఆభరణాలు మాయమయినట్లు గుర్తించాడు. వెంటనే తన పోలీస్ మిత్రుడికి ఫిర్యాదు చేయడానికి బయలుదేరాడు.అదే సమయంలో పోలీస్ కూడా పూజారిని వెతుక్కుంటూ గుడివైపు వస్తున్నాడు."ఆడబోయిన తీర్ధం ఎదురైందని "పూజారిని చూసి పోలీస్ అనుకుంటే,"వేదకబోయిన తీగ కాలికి తగిలిందని "పోలీస్ ను చూచిన పూజారి అనుకున్నాడు.
పూజారి "నువ్వెందుకు పరిగెత్తుకొని వస్తున్నావ్ "
పోలీస్ "నా సైకిల్ ఎవరో ఎత్తుకొని పోయారు. నువ్వు భవిష్యవాణి చెబుతావని వస్తున్నా "
పూజారి "అరె రామ. గుడిలో పూజ సామాగ్రి పోయిందని నీకు ఫిర్యాదు చేద్దామని వస్తున్నా."
ఇలా ఉంది మన పరిస్థితి
నువ్వు జ్వరం తగ్గాలని నా దగ్గరకు వచ్చావు. నాకూ మూడు రోజులుగా జ్వరం నేనెవరికీ చెప్పుకోవాలి."
అంటూ స్వామి నవ్వితే వృద్దుడూ శృతి కలిపాడు.
***జ్వరం సంగతి పక్కన పెడితే స్వామి వారి చతురత, సమయస్ఫూర్తి కి భక్తులు ఆనందించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి