*🕉️సంక్రాంతి శుభాకాంక్షలు*🕉️
సీసం
భోగిపండుగమీకుభోగమ్ములొసగుచు
ఆనందపరవశమందజేయు
సంక్రాంతిపర్వముసౌఖ్యములిచ్చుచు
మీకుటుంబమునకుమేలుజేయు
కనుమనిత్యంబుసత్కారములనిడుచు
గౌరవంబులనెన్నొకలుగజేయు
ముక్కనుమయెపుడుమోదంబుకలిగించి
విజయపథముననడ్పించుగాక
తే.గీ.
భార్యసహకారమందించపలువిధాల
బిడ్డలనుసరించుచుసదావిలువపెంచ
కొత్త సంవత్సరముమీకు కోర్కెదీర్చ
ఖ్యాతి ఆయురారోగ్యాలుకలుగుగాక
💐💐💐💐💐💐💐💐💐💐
తపస్వివిజయవాడ (పంతుల వేంకటేశ్వర రావు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి