13, డిసెంబర్ 2025, శనివారం

ముకుందమాల

  ముకుందమాల-. సౌందర్యమాల 

••••••••••••••••••••••

        సామాన్యముగా గ్రంథవ్యాప్తికిగ్రంథమందలి విషయముసార్వజనీన 

ముగా నుండుట ముఖ్య కారణము. విషయ వైశద్యమునకు దోడు సరసమైన శైలియు గూడిన ఇక చెప్పవలసిన పనియులేదు. బంగారానికి సువాసన అబ్బినట్లే ద్రాక్షాపాకమునబడిన వాల్మీకి వ్యాసకాళిదాసాది కృతులు సర్వ వ్యాపకమగుటయు , నారికేళ పాకమువంటి బిరుసు పాకమున బడిన భారవి శ్రీహర్షాదుల గ్రంథాలుకేవలంవిద్వాల్లోక వ్యాప్తం. ఇది విద్వాoసులు ఎరిగిన విషయమే. వేమన , పద్యాలు , సుమతి , కృష్ణ , దాశరథి శతకాలు తెలుగునాట బహుళ వ్యాప్తి చెందినవి. కానీ నూర్లకొద్ది నున్నశతకాలు వీటిలా ఎన్నివ్యాప్తి చెందినాయి ? నిజముగాఁజూచిన అర్థాలంకార వస్తుధ్వని భూషితములే గాక యవికొన్ని చిత్రాలంకార విచిత్రములై యున్నవే. మరి ! వ్యాప్తిలేకుండుటకు ఏమి కారణము ? వాని శైలి సర్వజనాకర్షకముగా ఉండకుండుటయే. చెప్పవలసిన విషయమును సూటిగా పాఠకుని హృదయమున హత్తుకొనునట్లు చెప్పలేకపోవుటయే. పోతనభాగవతమునకుగల ప్రచారము తక్కిన గ్రంథ రాజములకు లేకపోవడమే ప్రధాన కారణము. " ముకుందమాల విశ్వభారతమున వ్యాపించి తావులు గుబాళించుటకు మూలకారణము దాని సారళ్యమే. కాశ్మీరములో జనించిన కుంకుమపూవువలె కాశీలో ప్రవహించు గంగవలె కేరళలో ఉదయించిన ఈ ముకుందమాలయు సర్వభక్త సేవ్యమైనది. అకృత్రిమముగా , అప్రయత్నముగా భక్తాగ్రేసరుడగు శ్రీ కులశేఖరుని పరిపక్వ హృదయమునుండి వెల్లి విరిసి ముకుందుని కంఠ సీమ వనమాలయై మెరిసినది ఈ కుందమాల. పుష్పపరిమళమును గ్రహించుటకు పండిత పామర లొక్కతీరున సమర్థులైనట్లు లలితములైన ముకుందమాలను ఆ బాలగోపాలము ధరించి ఆనందింపగలిగిరి.

కామెంట్‌లు లేవు: