13, డిసెంబర్ 2025, శనివారం

భాగవత మధురిమలు*

  *శ్రీ పోతన భాగవత మధురిమలు*


(2-244-క)

తప మనఁగ మత్స్వరూపము

తపమను తరువునకు ఫలవితానము నే నా

తపముననే జననస్థి

త్యుపసంహరణము లొనర్చుచుండుదుఁ దనయా!


*భావము:-* పుత్రా! బ్రహ్మదేవ! తపస్సు అంటేనే నా స్వరూపం. తపస్సు అనే వృక్షానికి ఫలాన్ని నేనే. ఆ తపస్సు చేతనే సృష్టి స్థితి లయాలు సర్వం నిర్వహిస్తుంటాను. అంటు బ్రహ్మదేవునికి తపస్సు యొక్క రహస్యాన్ని నారాయణుడు వెలిబుచ్చాడు.


*శ్రీ కసాపురం ఆంజనేయ స్వామిని* స్తుతిస్తూ శుభోదయం.


*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*

ధర్మో రక్షతి రక్షితః

కామెంట్‌లు లేవు: