13, డిసెంబర్ 2025, శనివారం

ఓం జపిస్తే

  *🌹 రోజూ ఓం జపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నిత్య ఓం జప ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు 🌹*


*ఓం అనేది కేవలం పదం, శబ్ధం మాత్రమే కాదు అంటున్నారు పండితులు. ఇది విశ్వం యొక్క కంపనం, ఇది ప్రతి దానికీ ఆధారమైన నాడీ. ఓం అని జపించినప్పుడు ఓ.. ఊ.. మ్.. (ఏ, యూ, ఎమ్) అనే మూడు శబ్ధాలను ఉచ్చరించడం వలన మీ మనస్సు తేలిక అవుతుంది.*


*అందుకే చాలా మంది ప్రతి రోజూ ఓం అని జపిస్తుంటారు. అయితే ఇలా రోజూ ఓం అని జపించడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కాగా, ఓం జపించడం వలన ఇది ఎలాంటి ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.*


*ఓం అనే పదాన్ని జపించడం వలన ఇది మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. శ్వాస నెమ్మదిస్తుంది. దీని వలన నాడి వ్యవస్థ చల్లబడి, మీరు ఒత్తిడి నుంచి బయటపడి, ఉద్రిక్తత అనేది మీ లోనుంచి బయటకు వెళ్లిపోతుంది. దీంతో మీరు ఆరోగ్యంగా ఉంటారు.*

 

*ఓం అనే మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వలన ఇది మీ భావోద్వేగ స్థితిని తిరిగి పునరుద్ధరిస్తుంది. అలాగే క్రమం తప్పకుండా జపించడం వలన మీ భావోద్వేగాలు సమతుల్యం అవుతాయి, మీకు అంతర్గత శాంతి లభిస్తుంది. అలాగే, ఇది మీ దృష్టిని మెరుగు పరచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.*


*ఓం అనే జపం చేయడం వలన ఇది మీ ఉచ్ఛ్వాసాన్ని బయటకు వదులుతుంది. దీని వలన ఊపిరితిత్తులు బలంగా మారుతాయి. ఆక్సిజన్ బాగా ప్రవహించి, శరీరం లోతైన స్థాయిలో విశ్రాంతి తీసుకోవడం ప్రారంభిస్తుంది. మీ మనసు తేలిక పడుతుంది. దీని వలన మీ శ్వాస మెరుగు పడుతుంది.*


*ఇది మనసుకు, చాలా హాయినిస్తుంది. అదే విధంగా మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది. అయితే దీనిని జపించడం ఎలా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. కానీ దీని కోసం ఎలాంటి శిక్షణ లేకుండా, కేవలం నిశ్శబ్ద వాతావరణంలో సౌకర్యంగా, నిటారుగా కూర్చొని, జపించాలి అని నిపుణులు చెబుతారు.*

🌹 🌹 🌹 🌹 🌹

*

కామెంట్‌లు లేవు: