మలబద్ధక సమస్య గురించి వివరణ - 1.
కొంతమందిలో విరేచనం సాఫీగా ఉండదు. ఎక్కువ సమయం లెట్రిన్ లో గడపవలసి వస్తుంది. మలము ఒకేసారి విసర్జించకుండా కొంచం కొంచం విసర్జించడం జరుగుతుంది. ఇలా జరుగుతూ మరలా అర్థగంట తరువాత మరలా మలవిసర్జనకు వెళ్ళవలసి వస్తుంది. ఇలా ఉదయాన్నే 2 నుంచి 3 సార్లు వెళ్లవలసి వస్తుంది. అయినను సంపూర్ణముగా విరేచనం అవ్వదు . కడుపు తేలికగా ఉండకుండా బరువుగా అనిపించును. ఇంకా కొంత మలము ప్రేవులలో ఉండినట్లు అనిపించును.
ఈ సమస్య ఎక్కువుగా కూర్చుని పనిచేయు ఉద్యోగస్తులలోను , వ్యాపారస్తులలోను కనిపించును. చాలా మంది ఉదయం లేవగానే విరేచనముకు వెళ్తున్నాము ఎటువంటి సమస్య లేదని పొరబడుతున్నారు. నిజానికి ఆరోగ్యకరమైన మనిషి రోజుకు రెండుసార్లు విరేచనముకు వెళ్లవలెను . ఋతువు మారినప్పుడల్లా విరేచనౌషదాలు సేవించి కడుపును శుభ్రపరచుకోవలెను . ఈ కాలంలో ఈ నియమాలను ఎవరూ పాటించటం లేదు .
మలబద్దకం వలన ప్రేవులలోని వ్యర్దాలు బయటకి విసర్జించక పోవడం వలన శరీరంలో టాక్సిన్స్ ఎక్కువ అయ్యి అనేక రోగాలు వస్తాయి. రోగాలు రావడానికి మొదటి మెట్టు మలబద్దకం . ఎక్కువ కాలం ప్రేవులలో మలం సంపూర్ణముగా విసర్జించకుండా ఉండటం మూలాన ప్రేవులలో సీసం తయారగును.
మలబద్దకం లక్షణాలు -
* ఆకలి సరిగ్గా లేకుండా ఉండటం .
* తలనొప్పి .
* నిద్ర సరిగ్గా పట్టకపోవుట .
* ముఖంపైన మొటిమలు వచ్చును .
* శరీరం నందు వేడి పెరుగును .
* కంటి క్రింద నల్లటి చారలు వచ్చును.
* తలలో చుండ్రు పెరుగును . వెంట్రుకలు రాలును .
* కడుపులో మంట .
* నడుమునొప్పి .
మలబద్దకం రావడానికి గల కారణాలు -
* ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువుగా లేకుండా ఉండటం. పాలిష్ పట్టిన బియ్యం , మైదా పిండి వంటి వాటిలో పీచుపదార్థం అసలే ఉండదు .
* కాఫీ , టీ , మద్యము విపరీతముగా తాగుట వలన కూడా మలబద్దకం వచ్చును .
* నీరు తక్కువ తాగుట కూడా మలబద్ధకానికి కారణం అగును.
* శారీరక శ్రమ లేనందువలన మరియు మానసిక ఆందోళనకు తరచుగా గురగుట వలన కూడా మలబద్దకాన్ని కలుగచేయును .
తరవాతి పోస్టు నందు పాటించవలసిన ఆహార నియమాలు వివరిస్తాను . మరింత విలువైన సమాచారం మరియు అత్యంత సులభ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .
గమనిక -
నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
9885030034
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి