23, మే 2023, మంగళవారం

జగద్గురు అర్హత

 జగద్గురు అర్హత


1931వ సంవత్సరం చివరి రోజుల్లో బ్రిటీషు ప్రభుత్వం వారు కాంగ్రెస్ కార్యకర్తలను బంధించి, హింసించడం చాలా ఎక్కువగా ఉండేది. వారికి సహాయం చేసిన ప్రజలకు, సంస్థలకు కూడా తీవ్రమైన పరిస్థితులు కల్పిస్తామన్న హెచ్చరికలు జారీచేశారు.


పరమాచార్య స్వామివారు ఉత్తర ఆర్కాటు జిల్లాలోని ఆరణిలో మకాం చేస్తున్నారు. కాంగ్రెస్ వ్యక్తులు కొందరు స్వామివారిని దర్శించుకోవాలనుకున్నారు. ఈ సమయంలో స్వామివారు కాంగ్రెస్ వ్యక్తులను కలవడం వల్ల మఠానికి ఏదైనా సమస్య వస్తుందని శ్రీమఠం అధికారులు తెలిపారు.


పరమాచార్య స్వామివారు వారి భయాలన్నింటిని విని, “సభ్యులందరినీ లోపలకు రమ్మని చెప్పండి. అలాగే శ్రీమఠం తరుపున వారందరికీ భోజనాదులు ఏర్పాటు చెయ్యండి” అని ప్రశాంతంగా చెప్పారు.


నివ్వెరపోయిన మఠం అధికారులు భయంభయంగానే స్వామివారి ఆదేశాలను పాటించారు. కాని ప్రభుత్వం ఎటువంటి సమస్య ఎదురుకాలేదు.


బ్రిటీషు ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రతిచర్య లేదన్న సంతోషకర వార్తను మఠం మేనేజరు స్వామివారికి తెలుపగానే, “నన్ను చూడాలన్న వారిని కలవకుండా నేను తలుపులు మూసుకుంటే, జగద్గురు అన్న బిరుదునామం ఉంచుకోవడానికి, ఈ పీఠ సింహాసనం పైన కూర్చోవడానికి నాకు అర్హత ఉండదు” అని చెప్పారు.


--- రా. గణపతి, “మహా పెరియవాళ్ విరుంధు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: