నిత్యాన్వేషణ:
దక్షిణామూర్తి అన్న పేరు శివుడికి ఎందుకు వచ్చింది? ఆ స్వరూపానికి ఉన్న విశిష్టత ఏమిటి?
దిక్కులు 4
మూలలు 4
మొత్తంగా 8 అని చెప్పుకోవచ్చు.
సూర్యుడు ఉదయించేది తూర్పు. అస్తమించేది పడమర
ఈశాన్యంలో ఉన్నది ఈశానుడు.
జీవుడు దక్షిణంలో నేర్చుకున్న జ్ఞానం; లేదా జ్ఞాన సముపార్జనతోనే పరబ్రహ్మణి చేరుతాడు అదే ఉత్తరాయణం.
శివుడు దక్షిణాభిముఖుడై కూర్చుని ఉంటాడు కనుక దక్షిణా మూర్తి అను నామంతో పిలుస్తారు.
సద్యో జాతాది పంచ బ్రహ్మ మంత్రములలో
ఈశ్వరుని పంచాననునిగా అందులో వామ దేవ ముఖము దక్షిణముగా ఉంటుంది అని ఆ ముఖము నుండే దక్షిణామ్నాయ మంత్రాలు ఉద్భవించినవి అని చెబుతారు కనుక ఈ మూర్తిని దక్షిణామూర్తిగా పిలుస్తారు.
ఈశాననుని చేరడానికి జీవునికి జ్ఞానం అవసరం కునుక జీవుడు ముందుగా ఉత్తరమునకు వెళ్ళి దక్షిణాభి ముఖుడై ఉన్న మూర్తిని అర్చించి జ్ఞానాన్ని పొంది తద్వారా.....ఈశాననుని చేరవలసి ఉంది. అని చెబుతారు.
ఈ దక్షిణామూర్తి
ఓం వామదేవాయ నమో జేష్టాయ నమః శ్రేష్టాయ నమో
రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణా నమో
బలవికరనాయ నమో బాలాయ నమో
బలప్రమధనాయ నమ సర్వభూతదమనాయ నమో
మనోన్మనాయ నమః ||
శరీరంలో దక్షిణ భాగం అనగా కుడివైపు శివుడు
ఎడమవైపు అమ్మవారు
ఆమె ఉమ కాదు,
ఈ దక్షిణా మూర్తి 16 ఏండ్ల వాడు. ఆయన ఎడమ తొడపై అమ్మవారు కూర్చుని ఉంటుంది.
శివుడు పంచభూతాత్మాకుడు.
ఈయన నుండే జ్ఞానాన్ని జనులు స్వీకరిస్తారు. తద్వారా వారి బ్రతుకు జరుగుతుంది. క్రతువులు నిర్వహించడానికి ఈయన ఇచ్చిన జ్ఞానమే కావాల్సి ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి