22, జులై 2023, శనివారం

ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 


                             శ్లోకం :24/150 


సుతీక్ష్ణదశనశ్చైవ 

మహాకాయో మహాననః I  

విష్వక్సేనో హరిర్యజ్ఞః 

సంయుగాపీడవాహనః ॥ 24 ॥  


* సుతీక్ష్ణదశనః = మిక్కిలి పదునైన (వాడియైన) దంతములు కలవాడు, 

* మహాకాయః = గొప్ప శరీరము కలవాడు, 

* మహాననః = గొప్పదైన ముఖము కలవాడు, 

* విష్వక్సేనః = విష్ణు సేనాథిపతియైన విష్వక్సేనుని రూపము తానే అయినవాడు, 

* హరిః = విష్ణువే తానైనవాడు, 

* యజ్ఞః = తానే యజ్ఞపురుషుడైనవాడు, 

* సంయుగాపీడవాహనః = యుద్ధమందు బాధారహితమైన వాహనము కలవాడు. 


ప్రత్యేకం 


ॐ               హరిహర స్వరూపం 


    శంకరనారాయణ స్వరూపమూ అర్థనారీశ్వర స్వరూపమూ ఒకటేనని చెప్పడానికి శాస్త్రాలలో ఆధారాలున్నాయి. 

    మహావిష్ణువు ఈశ్వరునిలో ఒక భాగం; ఈశ్వరుడు కూడా మహావిష్ణువులో ఒక భాగమని చెప్పడానికి పురాణాల మూర్తులు, క్షేత్రాలు ఆధారాలు. 

    దక్షిణాన తిరునల్వేలి జిల్లాలో 'శంకర్ నయనార్ కోయల్ ' అనే ఊళ్ళో ఒకే మూర్తిలో శంకరనారాయణ స్వరూపంగా భగవానుడు ఉండటం నేటికీ మనం చూడవచ్చు. 

    ఇలాగే మైసూరు, మహారాష్ట్రలమధ్య 'హరిహర' క్షేత్రంలో హరి, హరుడు ఏకస్వరూపంగా ఇమిడి ఉన్నారు. 

             - కంచి పరమాచార్య 


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

కామెంట్‌లు లేవు: