31, ఆగస్టు 2023, గురువారం

మన సంస్కృతి

 డాక్టర్ రాధా కుసుమ 

శీర్షిక -మన సంస్కృతి


విజ్ఞాన మణిరత్నాలు

సందర్భ సౌగంధాలు

హృదయ నవోత్సవాలు

మనస్సుద్ది నిధులు

తేనియ మధుర మందస్మితాలు

మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు...!


మహాలక్ష్మి వ్రతమైనా

రాఖీ పౌర్ణమైనా

హొళీ ఉత్సవమైనా

అమ్మవారి జాతర లైనా

సమాజ శ్రేయస్సు కోసం

భావితరాలకు ఆదర్శమై

అనురాగాల వర్షితమై

జనుల సహకార సౌగంధమై

నిరంతర గంగాప్రవాహిణిలా

సాగిపోయే దే కదా

మన ఆచారాల వైభవాలు..!


స్వచ్ఛమైన మనసుతో

సుగంధ సుమధుర పారిజాత పుష్పాలై

ఆనంద శుభ కోయిల రావాలై

ఈర్ష్యా ద్వేషాలకు అతీతంగా

మంచితనపు వ్రత కమ్మదనపు

కథల్లో

నీతిని గ్రహించి

జీవించాలని

తెలిపేదే జీవన శైలి విధానాలే

మన పండుగలు...


హరిత చందనాల చేరువలో

ప్రకృతి రమణీయత కాపాడాలని

సోదర సోదరీ అనుబంధాల

సంతోషపు విరుల ఆనందం

సమాజమంతా పొందాలని

నేస్తాల గృహసీమలు

అనురాగాల శోభితమై

సుఖసంతోషాలు చేకూరాలని

కాంక్షిస్తూ

మీ అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలంటున్నది

మీ రాధా కుసుమం 🌹

కామెంట్‌లు లేవు: