31, ఆగస్టు 2023, గురువారం

శృంగేరీలో తోరణ-గణపతి

 





శృంగేరీలో తోరణ-గణపతి

400 సంవత్సరాల క్రితం మఠం మరియు దాని దేవాలయాలు & ఆస్తులు అధికారం కోసం పోరాడుతూ పొరుగు ప్రాంతాలలోని చిరు పెద్దల దాడికి గురయ్యే ప్రమాదంలో ఉన్నప్పుడు, అప్పటి జగద్గురు శంకరాచార్య, శ్రీ నృసింహ భారతి (IV) ఆలోచనలో పడ్డారు. ధ్యానంలో ఉన్నప్పుడు, తనకు దగ్గలో ఉన్న దేవుని ప్రార్థించమని సూచించిన స్వరం ఆయనకి వినిపించింది. వెతుకుతూ, జగద్గురువు తన తలపైన గుమ్మంలో (అక్షరాలా "తోరణ"పై) శ్రీ మహాగణపతి రూపాన్ని కనుగొన్నారు. అనుష్టానములను పూర్తి చేసి, గణేశుడిని పూజించి, జగద్గురువులు సభకు ప్రసాదాలు పంపిణీ చేశారు. గణేశుడి ఆశీస్సులతో జరగబోయే ప్రమాదం తప్పింది. అప్పటి నుంచి శృంగేరి శారదా పీఠంలోని జగద్గురువులు తోరణ గణపతికి పూజలు చేస్తున్నారు.

శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి మహాస్వామీజీ కాలంలో శృంగేరి శారదా పీఠంలోని జగద్గురువులు తుంగనది ఉత్తర తీరంలో ఉండేవారు. ఆ నివాసంలో ఒకానొక గుమ్మం పై ఈ గణగతిని కనుగొన్నారు. ప్రస్తుత కాలంలో జగద్గురువుల మకాం తుంగనది దక్షిణ తీరంలో ‘గురునివాస్’కి మారింది. పూర్వం ఆ గణపతి ఉన్న గుమ్మం స్థానంలో గ్రానైట్ తో ‘తోరణ-గణపతి’ ఆలయం నిర్మించడం జరిగింది.

ఈ చరిత్రను ఆధారం చేసుకొని భక్తులు తమకు సమస్యలు వచ్చినపుడు, పెద్ద పెద్ద కార్యాలు నిర్విఘ్నంగా నిర్హించడానికి ఈ గుడికొచ్చి మొక్కుకుంటుంటాారు. మ్రుక్కులను 108 మొదకాలు లేదా 108 టెంకాయలు సమర్పించి తీర్చుకొంటూవుంటారు.




ఈ విషయాలకు మూలం:



Sri Torana GanapatiHistory and description of the Shrine of Sri Torana Ganapati at Sringeri


https://sringeri.net/temples/sri-torana-ganapati

శృంగేరీలో స్తంభగణపతి

శృంగేరీ పట్టణం మధ్యలో ఒక గుట్ట (కన్నడంలో బెట్ట) వుంది. దానిపై ఋష్యశృంగుని తండ్రియైన విభాండక మహాముని తపస్సుచేశాడని చెబుతారు. ఆ స్థలంలో మల్లిఖాార్జునస్వామి (కన్నడంలో మలహానికరేశ్వరస్వామి అంటారు) ఆలయం వుంది. ఈ ఆలయంలో, శ్రీ అభినవ నరసింహ భారతి (1599 - 1622: శంకరాచార్య పరంపరలో 24వ ఆచార్యడు), గణేశుడి చిత్రం లేకపోవడాన్ని గమనించి, స్తంభాలలో ఒకదానిపై పసుపు కొమ్ముతో వినాయకుని బొమ్మను గీసి పూజించారట. అప్పటి నుండి, గణేశుడి రూపురేఖలు క్రమంగా ఉబ్బెత్తుగా పొంగాయట (ఒక బేస్ రిలీఫ్‌ మాదిరిగా). ఇప్పుడు స్తంభంలో ఆ వినాయకుడి వెనుక ఉన్న గ్రానైట్ రాయి లోపల గుల్లబారి బోలుగా ఉంది. మిగిలిన స్తంభ భాగం మాత్రం బలంగానే (solid) ఉంది. దీనినే స్తంభ గణపతి (కన్నడంలో కంబద గణపతి) అంటారు.


ఈ విషయాలకు మూలం:



Sri Sthambha Ganapati - Sri Sringeri Sharada PeethamSthambha Ganapati वन्दारुजनमन्दारं इन्दुचूडतनूभवम् । सिन्दूर बन्धूरमुखं वन्दे स्तम्बेरमाननम् ॥ It is in this temple that, Sri Ahinava Narasimha Bharati(1599 – 1622) 24th Acharya, noticed the absence of any Ganesha image, drew a figure of Ganesha with a piece of turmeric on one of the front pillars and worshipped it. Ever since, the outlines of […]


https://sringeri.net/temples/sri-malahanikareshwara/sri-sthambha-ganapati

కామెంట్‌లు లేవు: