ॐ "శ్రావణ" పౌర్ణమి శుభాకాంక్షలు.
🍀అశ్వముఖం కలిగిన దేవుని (హయగ్రీవుడు) "జయంతి"గా ఈ పౌర్ణమికి ప్రసిద్ధివుంది.
సర్వవిద్యలకూ ఆధారభూతుడు ఈ స్వామి.
క్రింది శ్లోక పఠనం ప్రతినిత్యం చేసుకుంటూ ఉంటే,
శ్రీమహావిష్ణువే అయిన హయగ్రీవుని అనుగ్రహంతో,
విద్యాజ్ఞానంతోకూడిన ఆనందం లభిస్తుంది.
శ్లో. జ్ఞానానందమయం దేవం
నిర్మల స్ఫటికాకృతిం I
ఆధారం సర్వవిద్యానాం
హయగ్రీవముపాస్మహే ॥
ఓం శ్రీ లక్ష్మీహయగ్రీవాయనమః
🍀"జంధ్యాల" పౌర్ణమిగా పిలువబడే ఈ రోజున, ప్రతీ సంవత్సరం, పాత యజ్ఞోపవీతాన్ని తీసి, క్రొత్త దానిని ధరించడం, వేద సంస్కృతిని అనుసరించే వారికి ఆనవాయితీ.
🍀నేడు ఎక్కువగా ప్రాచుర్యం పొందిన "రాఖీ" పౌర్ణమి కూడా ఈనాడే.
సోదరీమణులు తమ సోదరులకు, తమ రక్షణ బాధ్యతతోబాటు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా నిలవాలని కోరుతూ, రాఖీని కడుతుంటారు.
🍀"నేను నీకురక్ష, నీవు నాకురక్ష. మనమిరువురం దేశానికి రక్ష" అంటూ రక్షాబంధనం ధరించే "రక్షికా" పౌర్ణమికూడా ఇదే.
పరస్పరం రక్షించుకుంటూ
ధర్మరక్షణ, సమాజ పరిరక్షణా బాధ్యతలను తెలియజేసే అంతరార్థం ఇందులో ఇమిడివుంది.
=x=x=x=x
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి